/rtv/media/media_files/2026/03/04/iris-dena-2026-03-04-20-45-09.jpg)
హిందూ మహాసముద్రం రక్తసిక్తమైంది. శ్రీలంక తీరానికి సమీపంలో అమెరికా జలంతర్గామి, ఇరాన్ యుద్ధనౌకపై జరిపిన మెరుపు దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో 80 మంది చనిపోయారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా నేరుగా రంగంలోకి దిగడం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. శ్రీలంక దక్షిణ తీరానికి కేవలం 40 నాటికల్ మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన జలంతర్గామి ప్రయోగించిన టార్పిడోల ధాటికి ఇరాన్ గర్వకారణంగా భావించే 'ఐరిస్ డేనా' యుద్ధనౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ అధికారికంగా ధృవీకరించారు.
SENSATIONAL VIDEO FROM INDIA'S BACKYARD
— Rahul Shivshankar (@RShivshankar) March 4, 2026
DID U.S. FOREWARN INDIA? IF NOT, SHOULDN'T IT HAVE?
US Govt releases video footage of the moment Iranian warship IRIS Dena was sunk by a US submarine with a torpedo off the coast of Sri Lanka in the Indian Ocean. pic.twitter.com/Ewjcfh81Xl
80 మంది మృతి.. 32 మంది రక్షణ
శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ తెలిపిన వివరాల ప్రకారం, మౌడ్జ్-క్లాస్ ఫ్రిగేట్ అయిన ఐరిస్ డేనాలో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నారు. దాడి జరిగిన వెంటనే నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందడంతో శ్రీలంక నేవీ రంగంలోకి దిగింది. ఈ దాడిలో సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంక నౌకాదళం ఇప్పటివరకు 32 మందిని సురక్షితంగా రక్షించింది. గాయపడిన వారిని గాలే (Galle) లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
భారత్‌లో విన్యాసాలు ముగించుకుని వెళ్తుండగా..
ఈ ఘటనలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఇరాన్ యుద్ధనౌక ఇటీవల భారత్‌లో జరిగిన 'మిలాన్ 2026' (MILAN 2026) అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొంది. ఫిబ్రవరి 18 నుండి 25 వరకు బంగాళాఖాతంలో జరిగిన ఈ విన్యాసాలను ముగించుకుని తిరిగి వెళ్తుండగా, అమెరికా దీనిని లక్ష్యంగా చేసుకుంది.
ముదురుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న నీడ యుద్ధం (Shadow War) ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారుతోంది. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులు జరుగుతున్న తరుణంలో, అమెరికా నేరుగా ఇరాన్ యుద్ధనౌకను కూల్చివేయడం రష్యా, చైనా వంటి దేశాలను ఎలా స్పందించేలా చేస్తుందోనని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Follow Us