/rtv/media/media_files/2026/03/13/strait-of-hormuz-2026-03-13-13-50-40.jpg)
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు శత్రుదేశాల నౌకలకు మృత్యుమార్గంగా మారింది. ఇరాన్ తన పటిష్టమైన 'సీమైన్స్' వ్యూహంతో అమెరికా, దాని మిత్రదేశాల నౌకలను టార్గెట్‌గా చేసుకుంటోంది. సముద్ర గర్భంలో ఇరాన్ అమర్చిన మందుపాతరలు ఇప్పుడు ట్రంప్ సర్కార్‌పై కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్, ఓమన్ గల్ఫ్ మధ్య ఉంది. దీనికి ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్, UAE సరిహద్దులుగా ఉన్నాయి. ఈ జలసంధి అత్యంత ఇరుకైనది. దీని వెడల్పు సుమారు 33 నుండి 39 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. నౌకలు ప్రయాణించే మార్గం కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో దాదాపు 20% నుండి 30% ఈ చిన్న జలసంధి గుండానే వెళ్తుంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యూఏఈ దేశాల నుండి పెట్రోలియం ఎగుమతులు ఈ మార్గం ద్వారానే జరుగుతాయి.
🚨 Urgent: According to official statements, Iran’s Supreme Leader Mojtaba Khamenei has declared that the Strait of Hormuz should stay shut and has threatened attacks on U.S. bases in the Middle East if hostilities persist pic.twitter.com/WSXhgLxATw
— Iran Press (@GP_Presss) March 12, 2026
1. మందుపాతరలతో జలసంధి
ఇరాన్ తన రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ద్వారా హర్మూజ్ జలసంధిలో వేలాది సీమైన్స్, నేవల్ మైన్స్‌ను అమర్చింది. రాత్రివేళల్లో రాడార్లకు చిక్కని అతిచిన్న బోట్ల ద్వారా వెళ్లి రహస్యంగా ఈ బాంబులను నీటి అడుగున అమర్చుతున్నారు. నౌకలు లేదా సబ్‌మెరైన్లు వీటిని తాకగానే భారీ పేలుళ్లు సంభవించి నీటిలోనే సమాధి అవుతున్నాయి. అమెరికా విప్లవ కాలంలో గన్‌పౌడర్‌తో మొదలైన ఈ టెక్నాలజీని, నేడు ఇరాన్ అత్యంత ప్రమాదకరంగా మార్చింది.
2. ఇరాన్ సీమైన్స్
ఇరాన్ ప్రధానంగా మూడు రకాల మైన్స్‌ను ఉపయోగిస్తోంది.
కాంటాక్ట్ మైన్స్: ఇవి తయారీకి తక్కువ ఖర్చు అవుతాయి. నౌక వీటిని తాకగానే పేలిపోతాయి.
ఇన్‌ఫ్లూయెన్సర్ మైన్స్: ఇవి లేటెస్ట్ టెక్నాలజీతో పనిచేస్తాయి. నౌక నేరుగా తాకాల్సిన అవసరం లేదు. సెన్సార్ల ద్వారా నౌక శబ్దాన్ని లేదా అయస్కాంత తరంగాలను గుర్తించి ఇవి పేలుతాయి.
రైజింగ్ మైన్స్: ఇవి ప్రొజెక్టైల్స్ ద్వారా నేరుగా వెళ్లి నౌకను తాకేలా డిజైన్ చేయబడ్డాయి. దాదాపు 50 నుండి 1000 కేజీల పేలుడు పదార్థాలను ఇరాన్ ఈ మైన్స్‌లో వినియోగిస్తోంది.
3. ఇరాన్ సైనిక సామర్థ్యం
ఇరాన్ డిఫెన్స్ వద్ద ప్రస్తుతం 2,000 నుండి 6,000 వరకు సీమైన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే చైనా, రష్యా నుండి పెద్ద ఎత్తున వీటిని సేకరించిన ఇరాన్, ఇప్పుడు సొంతంగానే వీటిని ఉత్పత్తి చేస్తోంది. వందలాది చిన్న చిన్న స్పీడ్ బోట్లు, టెహ్రాన్ సబ్‌మెరైన్స్ ద్వారా ఈ మందుపాతరలను సముద్రంలో ఎక్కడికక్కడ విస్తరిస్తోంది.
4. ట్రంప్ వార్నింగ్ - అమెరికా ఎదురుదాడి
సముద్ర మార్గంలో రవాణాకు ఆటంకం కలిగిస్తున్న ఈ సీమైన్స్‌ను వెంటనే తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ క్రమంలోనే సీమైన్స్ అమరుస్తున్న 16 ఇరాన్ నౌకలను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. అయినప్పటికీ, ఇరాన్ తన 'మొజాయిక్' తరహా వ్యూహంతో దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో చాలా దేశాల్లో ఆందోళన మొదలైంది. హర్మూజ్ జలసంధి మూతపడితే గ్లోబల్ ఎకానమీ కుప్పకూలుతుందనే భయంతో అగ్రరాజ్యాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇరాన్ వేస్తున్న ఈ ఎత్తుగడలకు అమెరికా ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి.
Follow Us