Strait of Hormuz : అణ్వాయుధాల తయారీని ఆపేవరకు..  హర్మూజ్‌దిగ్బంధనమే...అమెరికా హెచ్చరిక

హర్మూజ్‌జలసంధి వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది. ఇరాన్ తన అణ్వాయుధ తయారీ ప్రయత్నాలను పూర్తిగా విరమించుకునే వరకు ఈ దిగ్బంధనం కొనసాగుతుందని, అవసరమైతే దీనిని శాశ్వత ఆంక్షలుగా మారుస్తామని అమెరికా హెచ్చరించింది.

New Update
FotoJet - 2026-04-25T184934.474

US Defense Secretary Pete Hegseth

Strait of Hormuz :  హర్మూజ్‌జలసంధి (Strait of Hormuz) వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ చమురు రవాణాకు జీవనాడి వంటి ఈ జలసంధి వద్ద అమెరికా విధిస్తున్న 'ఉక్కు కవచం' వంటి దిగ్బంధనం ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. ఇస్లామాబాద్‌ వేదికగా శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి.

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణను "ఉక్కు కవచం" (Iron Shield) తో పోల్చారు. ఇరాన్ తన అణ్వాయుధ తయారీ ప్రయత్నాలను పూర్తిగా విరమించుకునే వరకు ఈ దిగ్బంధనం కొనసాగుతుందని, అవసరమైతే దీనిని శాశ్వత ఆంక్షలుగా మారుస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా అనుమతి లేకుండా హోర్ముజ్‌లోకి ఏ రవాణా నౌకా రాదని, బయటకు వెళ్లదని హెగ్సెత్ స్పష్టం చేశారు.అంతర్జాతీయ స్థిరత్వానికి ఇరాన్ నుంచి పొంచి ఉన్న అణు ముప్పును తొలగించడమే ఈ ప్రమాదకరమైన మిషన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

  ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ నౌకలపై దాడులు చేస్తూ ఒక "సముద్రపు దొంగల ముఠా" వలె ప్రవర్తిస్తోందని, సముద్ర భద్రతను అస్థిరపరుస్తోందని అమెరికా తీవ్రంగా ఆరోపించింది.అమెరికా జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ డాన్ కెయిన్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ దిగ్బంధనం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 34 నౌకలను అమెరికా దళాలు వెనక్కి పంపాయి.

ఇటీవల అమెరికా ఆదేశాలను ధిక్కరించి ముందుకు సాగేందుకు ప్రయత్నించిన ఒక ఇరాన్ నౌకపై యూఎస్ దళాలు కాల్పులు జరిపాయి. ఆ నౌకలోని సిబ్బందిని ప్రస్తుతం అమెరికా తన అదుపులోకి తీసుకుంది. ఈ ఆంక్షలు కేవలం గల్ఫ్ ప్రాంతానికే పరిమితం కాకుండా, హిందూ మరియు పసిఫిక్ మహాసముద్రాల్లోనూ ఇరాన్ నౌకలను అడ్డగించేలా విస్తరించినట్లు కెయిన్ తెలిపారు.అమెరికా విధిస్తున్న ఈ దిగ్బంధనం ఇరాన్‌కు ప్రాణసంకటంగా మారింది.
 ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు ఎగుమతులపై ఆధారపడి ఉంటుంది. హోర్ముజ్ జలసంధి మూతపడటంతో ఎగుమతులు స్తంభించి, దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.ఈ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికాతో చర్చలు జరిపి గండం నుంచి గట్టెక్కాలని ఒక వర్గం ఇరాన్ నాయకులు భావిస్తుండగా, అత్యంత శక్తివంతమైన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) మాత్రం వెనక్కి తగ్గేది లేదని భీష్మిస్తోంది.

 ఒకవైపు పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష చర్చలకు ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు అమెరికా తన సైనిక ఒత్తిడిని పెంచడం గమనార్హం. "అమెరికా షరతులకు అంగీకరిస్తేనే ఏ ఒప్పందమైనా సాధ్యం" అని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అటు అణు కార్యక్రమం, ఇటు ఆర్థిక మనుగడ మధ్య ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.ముఖ్యంగా, ఈ దిగ్బంధనం వల్ల అంతర్జాతీయ చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, ప్రపంచ దేశాలు కూడా ఈ 'ఇరాన్ అణు సంక్షోభం 2026' పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు