/rtv/media/media_files/2026/04/14/fotojet-60-2026-04-14-14-47-59.jpg)
Ukraine Robot Warfare
Ukraine Robot Warfare : ఇన్నాళ్ల ప్రపంచ పటంలో పెద్దదేశాలుగా చెలామణి అవుతున్న అమెరికా, రష్యా వంటి దేశాలకు చిన్నచిన్న దేశాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా ఇరాన్ ఉక్రెయుద్ధంలో ఇరాన్ అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది. మరోవైపు ఉక్రెయిన్‌పై గత కొంతకాలంగా యుద్ధం చేస్తున్న రష్యాకు ఆ దేశం కూడా ఏ మాత్రం జంకడం లేదు. పైగా రష్యాకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. ఆయన ప్రకటన ప్రకారం కేవలం రోబోలు, ఇతర మానవరహిత వాహనాల సాయంతో రష్యాకు చెందిన ఒక స్థావరాన్ని కైవసం చేసుకున్నామని ప్రకటించారు.
The capabilities of Ukraine’s defense industry mean millions of FPV drones per year, our deep strikes, our interceptors, and millions of shells. Ukraine has its own long-range missile weapons. Not just in development, but a real force already at work. Flamingo and Ruta, Peklo and… pic.twitter.com/6LCeIpIuuZ
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) April 13, 2026
అంతేకాదు తమ వ్యూహం దెబ్బకు శత్రుదేశ సైనికులు తమకు లొంగిపోయారని కూడా ఆయన ప్రకటించారు. యుద్ధ క్షేత్రానికి సైనికులను పంపకుండానే ఈ ఆపరేషన్‌ను నిర్వహించామని ఆయన చెప్పుకొచ్చారు. తమ సైనికులు రిమోట్‌తో డ్రోన్స్, ఇతర వాహనాలను నియంత్రిస్తూ రష్యా స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నారని జెలెన్‌స్కీ వెల్లడించారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో సైనికులను కాపాడుకోవచ్చనేందుకు ఇది ఒక ఉదాహరణ అని కూడా ఆయన పేర్కొన్నారు. ఇది నిజంగా రష్యాకు కోలుకోలేని దెబ్బగానే చెప్పచ్చు.
కాగా, ఉక్రెయిన్ గత మూడు నెలలుగా ఇలాంటి రోబోలతో సుమారు 22 వేలకు పైగా మిషన్స్ నిర్వహించామని జెలెన్ స్కీ ప్రకటించడం గమనార్హం. రాటెల్, టెర్‌ఎమ్ఐటీ, ఇతర రోబోటిక్ వ్యవస్థలతో ఈ మిషన్స్ నిర్వహించామని కూడా ఆయన వెల్లడించారు. ప్రమాదకర మిషన్లకు రోబోలు వెళితే ఎందరో మనుషుల ప్రాణాలు నిలుస్తాయని కూడా జెలెన్ స్కీ అన్నారు. అత్యంత విలువైన ప్రాణాలను టెక్నాలజీతో కాపాడుకుంటున్నామని అన్నారు. తాజా మిషన్‌కు సంబంధించి పలు ఫొటోలను కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం సంచలనంగా మారింది.
Follow Us