/rtv/media/media_files/jyG66haxP6eTpcjlRT3v.jpg)
Trump's another shock
Trump's another shock : ట్రంప్ అధికారం చేపట్టగానే వలసదారులకు వరుసగా షాక్‌లు ఇస్తూనే ఉన్నారు. అలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారో లేదో.. వలసదారులను ఎత్తి కుదిపేసినంత పనిచేశారు. ఆయా దేశాలకు చెందిన వలసవాదులు దేశం వదలి వెళ్లాల్సిందేనని ఖరాకండిగా చెప్పారు. ఇదే క్రమంలో ఇన్నాళ్లూ కీలకమైన హెచ్ 1బీ వీసాలు, ఎఫ్1 వీసాలు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు సహాయం అందిస్తూ వచ్చిన ఆఫీసుపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఏటా హెచ్1బీ వీసాలు, ఎఫ్1 వీసాలు కలిగిన వారు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు తమకు ఇమ్మిగ్రేషన్ విషయాల్లో సాయం కోసం ఉపయోగించుకుంటున్న హెల్ప్ డెస్క్ ను సస్పెండ్ చేస్తూ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు
ఈ మేరకు ట్రంప్ సర్కార్ అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వేరే కార్యాలయానికి మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇకపై ఈ హెల్ప్ డెస్క్ సేవలు కావాలనుకునే వారికి అవి లభించవు. సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (సీఐఎస్) అంబుడ్స్‌మన్ కార్యాలయ సిబ్బందిని 60 రోజుల పరిపాలనా సెలవుపై పంపారు. ఇది స్వతంత్ర ఇమ్మిగ్రేషన్ పర్యవేక్షణ సంస్థను రద్దు చేసే దిశగా తొలి అడుగు అని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 21న డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తీసుకున్న చర్యలు ఆఫీస్ ఫర్ సివిల్ రైట్స్ అండ్ సివిల్ లిబర్టీస్, ఆఫీస్ ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ అంబుడ్స్‌మన్‌పై కూడా ప్రభావం చూపింది. దీంతో సీఐఎస్ మూతపడినట్లు తెలుస్తోంది.
Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
వీసా, గ్రీన్ కార్డ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కార్ చెబుతున్నప్పటికీ అంబుడ్స్‌మన్ ప్రమేయం లేకుండా వలస కేసులు ఎలా పరిష్కారిస్తారో మాత్రం చెప్పడం లేదు. దీంతో సహజంగానే ఈ వీసాలు కలిగిన, గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న భారతీయులపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. వీసా ప్రాసెసింగ్ జాప్యాలు, బ్యూరోక్రాటిక్ ఇబ్బందుల పరిష్కారం కోసం ఇప్పటివరకూ పనిచేసిన ఈ సంస్థ ఏటా సుమారు 30 వేల మందికి సాయం చేసింది. ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయంతో ప్రభావితం అయ్యే వారు ఆలస్యమైన లేదా వివాదాస్పదమైన USCIS కేసులలో సహాయం కోసం కాంగ్రెస్ ప్రతినిధిని సంప్రదించాలని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. వృత్తిపరమైన మార్గదర్శకత్వం కోసం ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులను సంప్రదించాలని కోరుతున్నారు. తమ వద్ద అన్ని రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వీసాలు, గ్రీన్ కార్డుల కోసం ప్రీమియం ప్రాసెసింగ్ సదుపాయం వాడుకోవాలని కోరుతున్నారు. ట్రంప్ సర్కార్ నిర్ణయం నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు తమ హెచ్1బీ ఉద్యోగుల్ని ప్రయాణాలు మానుకోవాలని కోరుతున్నాయి.
Also Read: This Week Ott Movies: ఈవారం ఓటీటీ, థియేటర్స్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. సినిమాల లిస్ట్ ఇదే?