/rtv/media/media_files/2026/04/14/iran-us-2026-04-14-21-15-52.jpg)
Pakistan unpaid hotel bill
Pakistan unpaid hotel bill : ఇరాన్, అమెరికా యుద్ధం ఏమోగాని పాకిస్థాన్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి శాంతి చర్చల పేరుతో రెండు దేశాలను ఇస్లామాబాద్‌కు పిలిచింది. తన మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య శాంతిచర్చలు సఫలం అయితే అమెరికా నుంచి అప్పు, అటు గల్ఫ్ దేశాల నుంచి ఇంధన తెచ్చుకుని దేశ పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ప్రయత్నించింది. తద్వారా ప్రపంచం దృష్టిలో శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలని తెగ ఉబలాటపడింది. కానీ, చర్చలు విఫలం కావడమే కాక పాకిస్థాన్‌కు ఘోర అవమానం మిగిలింది. అదేంటంటే రెండు దేశాల మధ్య చర్చలకు వేదికైన ఇస్లామాబాద్‌లోని హోటల్ బిల్లు కూడా పాకిస్థాన్ చెల్లించలేక పోయిందట. దీంతో హోటల్ యాజమాన్యం ముందు తలదించుకోవలసి వచ్చిందట.
అసలే దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరగడంతో పాక్ చాలాకాలంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దీనికి తోడు యుద్ధం మూలంగా చమురు దిగుమతులు నిలిచిపోవడంతో దేశంలో పాక్షిక లాక్ డౌన్ నడుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి కోట్లల్లో అప్పులు తెచ్చుకుంటూ కొంత ఉపశమనం పొందుతుంది. ఇటువంటి తరుణంలో అమెరికా- ఇరాన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించే అవకాశం లభించింది. దీనికోసం అమెరికా, ఇరాన్ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ నెల 10వ తేదీన ఇస్లామబాద్‌కు వెళ్లారు. వారికి ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనాలో విడిది ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడే శాంతి చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ రెండు దేశాలు ఎటువి అటు పోయాయి.
శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన పాకిస్థానే హోటల్ బిల్లులు చెల్లించాలి. కానీ, హోటల్ బిల్లుల్ని కూడా పాక్ ప్రభుత్వం చెల్లించలేకపోయింది. నాలుగు రోజులు ఓపిక పట్టిన హోటల్ యజమాని స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందట. వెంటనే బిల్లు చెల్లించాలని, హోటల్ యాజమాన్య సంస్థ అయిన అగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ సంస్థ డిమాండ్ చేసింది. దీంతో బిల్లు ఎలా కట్లాలిరా దేవుడా అని పాక్ తలపట్టుకుందట.
కాగా, అమెరికా- ఇరాన్ యుద్ధాన్ని ఆపి ప్రపంచం ముందు హీరో అవ్వాలని ఉవ్విళ్లూరిన పాకిస్థాన్ బిల్లు చెల్లించలేక చతికిల పడటంతో పాకిస్థాన్ పరిస్థితి ఏతులకు పోతే మూతికాలినట్లయిందని పలువురు నవ్వుకుంటున్నారు.
Follow Us