Iran War Update: రాబోయే 48 గంటలు ఇళ్లల్లోనే ఉండండి..ఇరాన్‌లోని ఇండియన్స్‌కు కేంద్రం హెచ్చరిక

ఇరాన్‌, అమెరికా యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో కేంద్రంతో పాటుటెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లోని భారత పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలకు, బహుళ అంతస్తులకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.

New Update
FotoJet (6)

Stay at home for the next 48 hours.. Center warns Indians in Iran

 Iran War Update:  ఇరాన్‌, అమెరికా యుద్ధం తీవ్రమవుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులకు కీలక ప్రకటన జారీ చేశాయి. రాబోయే 48 గంటల పాటు భారతీయులు ఉన్న చోటనే ఉండాలని. ఎవరి ఇండ్లలో వారుండాలని సూచించింది. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అన్ని విద్యుత్, సైనిక స్థావరాలకు, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని ఆ సలహాలో పేర్కొన్నారు. ఎవరు బయటకు రావోద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించింది.
 
హార్మూజ్‌ జలసంధిని తెరవకపోతే ఈ రాత్రి ఇరాన్‌కు చివరి రాత్రి అవుతుందని ట్రంప్ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మరికొద్ది గంటల్లో ట్రంప్ డెడ్‌లైన్ ముగియనుంది. దీంతో ఇండియా అలర్ట్ అయింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులను అప్రమత్తం చేసింది.ఎత్తైన భవనాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఎప్పటికప్పుడు ఎంబసీ అధికారులతో టచ్‌లో ఉండాలని కోరింది. సమాచారం లేకుండా సరిహద్దులు దాటే ప్రయత్నం చేయవద్దని ఎంబసీ హెచ్చరించింది.కాగా, ఇరాన్‌లో సుమారు  9,000 మంది భారతీయులు నివాసం ఉంటున్నారు.  ఇరాన్‌కు ఇదే చివరి రాత్రి అంటూ తాజాగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతోప్రపంచవ్యాప్తంగా ఏ నిమిషానికి ఏం సంభవిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
 
ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో  తాజాగా ఇరాన్‌లోని అత్యంత ముఖ్యమైన చమురు కేంద్రం ఖార్గ్ ద్వీపంపై వరుస దాడులు జరిగాయి. హార్మూజ్ జలసంధిని తెరవడానికి బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఇరాన్‌కు గడువు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువుకు కొద్ది గంటల ముందే ఈ దాడి చేయడం గమనార్హం. మరోవైపు ఇరాన్‌కు ఇచ్చిన గడువులోగా టెహ్రాన్‌ను నాశనం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించిన విషయం తెలిసిందే. సోషల్ ట్రూత్  వెబ్‌సైట్‌లో పెట్టిన ఒక పోస్ట్‌లో, మంగళవారం రాత్రి (ఏప్రిల్ 7, 2026) ఒక నాగరికత పూర్తిగా నాశనమవుతుందని, దానిని తిరిగి పునరుద్ధరించడం ఎప్పటికీ సాధ్యం కాదని ఘూటుగా హెచ్చరించాడు. దానికి ఇరాన్ సైతం అంతే స్థాయిలో తిరిగి బదలిచ్చింది. ఇరాన్‌ నాగరికతను ఎవరు నాశనం చేయలేరని తేల్చి చెప్పింది. సైకో మాటలకు ఎవరూ బయటపడరు అంటూ బదులిచ్చింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం ఏం జరుగుతుందోననే టెన్షన్‌ అందరిలో నెలకొంది. ఈ క్రమంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేసింది.

Advertisment
తాజా కథనాలు