ఇజ్రాయెల్‌తో యుద్ధం.. సైన్యానికి ఇరాన్ కీలక ఆదేశాలు..ఏ క్షణంలోనైనా..! యుద్ధానికి సిద్దమని ఇరాన్, ఇజ్రాయెల్ చెప్పేసినట్లే తెలుస్తుంది. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఇరాన్ పెద్దలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 25 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Israel-Iran War: యుద్ధానికి సిద్దమని ఇరాన్, ఇజ్రాయెల్ చెప్పేసినట్లే తెలుస్తుంది. ఇప్పటికే రెండు దేశాలు కూడా ఆయుధ పూజను మొదలు పెట్టేశాయి. మిలటరీ నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వరకు అన్నింటిని రెండు దేశాలు స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ సిద్ధం చేసిన ఆయుధాలు ఏంటి? రెండు దేశాలు యుద్ధంలోకి దిగినట్లేనా? పశ్చిమాసియాలో ఇక రక్తపాతమేనా?ఇరాన్ అర్మాన్ వర్సెస్ ఇజ్రాయెల్ థాడ్.. ఎప్పుడు ఏం జరుగుతుతుందోననే భయం. קבוצת צעירים יהודים פרצו הלילה למרחב הגבול של רצועת עזה במטרה להיכנס לרצועה. כוח צבאי קפץ למקום באמצע הלילה כדי לפנות אותם - המשטרה עצרה מספר נערים@hod_barel pic.twitter.com/J5qDd0wR0Y — גלצ (@GLZRadio) October 25, 2024 Also Read: సంధి దిశగా ఇజ్రాయెల్-హమాస్ ! ఎవరు ఏం చేస్తారో అనే ఆందోళన. వీటన్నింటి మధ్య పశ్చిమాసియా గజగజలాడిపోతుంది. ఇజ్రాయెల్ మీద ఇరాన్ మిస్సైల్ దాడులు చేసింది. మళ్లీ దాడులు చేసే సత్తా ఉన్నా, బలమైన సైన్యం ఉన్నా.. ఇజ్రాయెల్ ఇన్నాళ్లూ మౌనంగానే ఉంది. ఆ మౌనం ప్రపంచాన్ని భయపెట్టింది. ఇరాన్ మీద దాడికి ముందు హమాస్, హెజ్ బొల్లాను లక్ష్యంగా చేసుకుంది. Also Read: తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు! దాదాపు హమాస్ పెద్ద తలకాయలన్నింటిని లేపేసింది కూడా. ఇక ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్, హైఫా నగరాలను టార్గెట్ చేసుకుని హెజ్బొల్లా డ్రోన్ దాడులకు తెగబడింది. ప్రధాని నెతన్యాహు ఇంటిపై డ్రోన్ అటాక్ ప్లాన్ తో ఇజ్రాయెల్ కు కోపం కట్టలు తెంచుకుంది. హెజ్బూల్లా ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్ట కూడదని ఇజ్రాయెల్ ఫిక్స్ అయ్యింది. సమరభేరి మోగించింది. మా దగ్గర ఓ ప్రణాళిక ఉంది...మీరు ఊ అనండి అన్నట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని ముందు సైన్యం ఓ లిస్టు కూడా పెట్టింది. Also Read: ఏపీపై దానా తుపాన్ ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు యుద్ధానికి సిద్ధంగా... అదే లిస్టును అమెరికాకు కూడా ఇచ్చింది. దీంతో యుద్ధం తప్పనిసరి అని తెలుస్తుంది. నవంబర్ 5లోపే దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుండగా.. అదే లెవల్ లో కౌంటర్ ఇచ్చేందుకు ఇరాన్ కూడా సిద్దంగా ఉంది. అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే ప్రపంచానికి మన పవర్ ఏంటో అప్పుడు తెలుస్తుందంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు.. ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఇరాన్ పెద్దలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Also Read: హ్యాపీ "కోడి కత్తి డే" జగన్ అంటూ టీడీపీ ట్వీట్.. వైసీపీ కౌంటర్! ఇంతకీ ఇజ్రాయెల్ ఏం ప్లాన్ చేస్తోంది? ఇరాన్ మీద ఎలాంటి టార్గెట్లు ఫిక్స్ చేసింది? పశ్చిమాసియాలో రక్తపాతం తప్పదా? ఇజ్రాయెల్ మంత్రి మాటలకు అర్థమేంటి? ఇజ్రాయెల్ దూకుడు అమెరికాను కూడా టెన్షన్ పెడుతోందా?ఇరాన్ తో కంపేర్ చేస్తే సైనిక విషయంలో ఇజ్రాయెల్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. జనాభా పరంగా చిన్న దేశమైనా సైన్యం పరంగా చాలా ఎత్తులో ఉంది. రక్షణ రంగానికి భారీ బడ్జెట్ కేటాయింపులు, అడ్వాన్స్డ్ రిజర్వ్ ఫోర్స్ లు, మొసాద్ లాంటి నిఘా వ్యవస్థ, పైగా అమెరికా లాంటి మిత్ర దేశాల సపోర్ట్.. అన్నీ కలిసి ఇజ్రాయెల్ సైన్యాన్ని మరింత బలంగా మార్చాయి. ఇజ్రాయెల్ వైపు అమెరికా ఉంది. యుద్ధం ముదిరి ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తుంది అనుకుంటే.. ఇరాన్ వైపు చైనా, రష్యా మద్దతుగా దిగే అవకాశాలు కనపడుతున్నాయి. #israel iran war news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి