US Iran talks second round : అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు.. మాకేం తెలియదంటున్న పాక్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు రెండో సారి శాంతి చర్చలకు రెండు దేశాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ చర్చలు ఎక్కడ జరుగుతాయి అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంలో మాకు ఎలాంటి సమాచారం లేదని పాకిస్థాన్ ప్రకటించింది.

New Update
FotoJet (81)

Second round of talks between US and Iran

US Iran talks second round :  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే పూర్తి స్థాయి యుద్ద విరమణ కోసం పాకిస్థాన్‌ మధ్యవర్తిగా ఇస్లామాబాద్‌లో సమావేశమైనప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండానే చర్చలు విఫలమయ్యాయి. అయితే  రెండో సారి శాంతి చర్చలకు రెండు దేశాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ చర్చలు ఎక్కడ జరుగుతాయి అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గతంలో మాదిరిగా తిరిగి ఇస్లామాబాద్‌లో సమావేశం అవుతాయా లేక మరోచోట అనేది క్లారిటీ రాలేదు. అదే సమయంలో ఈ విషయంలో మాకు ఎలాంటి సమాచారం లేదని పాకిస్థాన్ ప్రకటించింది.

 పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన మొదటి దఫా చర్చలు స్పష్టమైన ఒప్పందం లేకుండానే ముగిశాయి. అయినప్పటికీ, రెండు దేశాలు మరోసారి చర్చలు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం రోజుల్లోనే ఆ చర్చలు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ఇదిలా ఉండగా రెండో దఫా శాంతి చర్చలు ఎక్కడ నిర్వహిస్తారన్న విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. అంతేకాదు తొలిసారి చర్చలకు అతిథ్య ఇచ్చిన పాకిస్థాన్ సైతం దీనిపై తమకు ఎలాంటి సమాచారమూ లేదని వెల్లడించడం గమనార్హం. రెండో విడత చర్చలు జరగనున్నాయి కానీ, వాటి తేదీ, వేదిక ఇంకా ఖరారు కాలేదని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చల విషయంలో మొదటి నుంచి పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇరు పక్షాల మధ్య సమాచార వారధిలా ముందునుండి పని చేస్తోంది. అందువల్లే తొలి విడత చర్చలు పాకిస్థాన్‌లో జరిగాయి. 

ఇక రెండో విడత చర్చలు కూడా త్వరలోనే జరుగుతాయని తెలుస్తోంది. అయితే ఇంకా తేదీ, వేదిక మాత్రం ఇంతవరకు ఖరారు కాలేదు కాగా, ఈ చర్చలు ముందుకు సాగడంలో  పలు అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు, హార్మూజ్‌ను పూర్తిగా తెరవడం, ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయడం మొదలైన అంశాల గురించి చర్చలకు ముందే క్లారిటీ రావాల్సి ఉంది. వాటిపై క్లారిటీ వస్తే శాంతిచర్చలు ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు