ఇండియాతోపాటు మరో 14 దేశాలకు సౌదీ ఆరేబియా బిగ్‌షాక్ ఇచ్చింది. సౌదీ అరేబియా దేశం ఇండియాకు వీసాలను నిలిపివేసింది. సౌదీ అధికారులు మరో 14 దేశాలకు కూడా వీసాల జారీ నిషేధించారు. ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాలపైనా కూడా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేద ఆంక్షలు 2025 జూన్ వరకు అమలు ఉండనున్నాయి. ఈ జాబితాలో ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్డాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యునీషియా, యెమెన్, మొరాకో దేశాలు ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ లేకుండా పెద్ద ఎత్తున హజ్‌కు హాజరవుతుండడంపై సౌదీ అభ్యంతరం తెలిపింది. సౌదీలో హజ్ యాత్ర కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంది అక్కడ ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు రావడం సౌదీ నిర్మూలించాలని భావిస్తోంది. ఉమ్రా వీసాలు కలిగి ఉన్నవాళ్లకు ఏప్రిల్ 13 వరకు సౌదీలోకి వెళ్లవచ్చు. హజ్ యాత్ర కారణంగా 2024లో 1200 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Also read: Lady Aghori: ప్రభాస్ ఇంటి పక్క ఆ విల్లాపై అఘోరీ క్లారిటీ.. అది మాత్రమే నిజం