Putin: ఇండియన్‌ సినిమాలంటే మాకు ఎంతో ఆసక్తంటున్న రష్యా అధ్యక్షుడు!

భారతీయ చలన చిత్రాలకు రష్యాలో మంచి ఆదరణ ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్నారు. రష్యాలో 24 గంటలూ భారతీయ సినిమాలు వచ్చే ప్రత్యేక టీవీ ఛానల్ సైతం ఉందని చెప్పారు. మాకు భారతీయ చిత్రాలు అంటే ఎంతో ఆసక్తి అని పేర్కొన్నారు.

New Update
Putin: ఉక్రెయిన్ బలగాలే రష్యా సైనిక రవాణా విమానాన్ని కూల్చేశాయి

Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారతీయ చిత్ర సీమ పై ప్రశంసలు కురిపించారు. తమ దేశంలో భారతీయ చిత్రాలకు మంచి ఆదరణ ఉందన్నారు. భారత్‌ సభ్యదేశంగా ఉన్న ఐదు దేశాల కూటమి బ్రిక్స్‌ సమావేశం ఈ నెల 22,23 తేదీల్లో రష్యాలో జరగబోతుంది. ఇందులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ పర్యటన కూడా ఫిక్స్ అయ్యింది. బ్రిక్స్‌ సమావేశాల నేపథ్యంలో పుతిన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Also Read: వాలంటీర్లకు బిగ్ షాక్.. కీలక ప్రకటన!

భారతీయ చలన చిత్రాలకు..

బ్రిక్స్‌ సభ్యదేశాలకు రష్యాలో తీయబోయే చిత్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తారా అనే ప్రశ్నకు పుతిన్‌ సమాధానమిచ్చారు. '' భారతీయ చలన చిత్రాలకు రష్యాలో మంచి ఆదరణ ఉంది. రష్యాలో 24 గంటలూ భారతీయ సినిమాలు వచ్చే ప్రత్యేక టీవీ ఛానల్ సైతం ఉంది. మాకు భారతీయ చిత్రాలు అంటే ఎంతో ఆసక్తి. మేము బ్రిక్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నాం. మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఈ ఏడాది బ్రిక్స్‌ దేశాలకు చెందిన చలన చిత్రాలను సైతం ప్రదర్శించనున్నాం.

Also Read: మియాపూర్ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు

ఇండియన్‌ మూవీస్‌ ను రష్యాలో ప్రదర్శించడానికి మేము ఎప్పుడు కూడా సానుకూలంగా ఉన్నాం. వారి చిత్రాలను ప్రమోట్‌ చేసేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని, అంతేకాకుండా ఫార్మా రంగానికి సైతం ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాల పై భారత ప్రధాని మోదీతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని పుతిన్‌ పేర్కొన్నారు.

Also Read:  భారతీయులకు బంపర్ ఆఫర్..యూఏఈ వీసా ఆన్ అరైవల్

భారత ప్రధాని మోదీతో కజన్‌ లో ఈ విషయం పై మాట్లాడతాను. ఈ ప్రతిపాదన ముందుకు వెళ్తుందని నాకు 100 శాతం నమ్మకం ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేవు. భారత్‌ తో పాటు బ్రిక్స్‌ కూటమిలోని ఇతర దేశాల చిత్రాల సంస్కృతులు, నటులను చూడడం చాలా మనోహరంగా ఉంటుంది. థియేట్రికల్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌ ఏర్పాటు చేయాలని బ్రిక్స్‌ కూటమి సభ్యులం చర్చించుకున్నాం.

Also Read: గవర్నర్‌‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్

సినిమా ఆకాడమీని ఏర్పాటు చేశాం'' అని పుతిన్ చెప్పుకొచ్చారు. భవిష్యతులో బ్రిక్స్‌ కూటమి దేశాలతో కలిసి మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ను సైతం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు