US–Iran war : ఇరాన్‌పై దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలు..రష్యా వార్నింగ్

మధ్యప్రాచ్యంలో ఇరాన్‌పై జరుగుతున్న దాడులపై రష్యా తీవ్రంగా స్పందించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఈ దాడులను ఆపాలని కోరింది. దాడులు ఆపకపోతే భయంకరమైన పరిణామాలు ఉంటాయని రష్యా ఆయా దేశాలను హెచ్చరించింది.

New Update
Israel-iran War

US–Iran war

US–Iran war : మధ్యప్రాచ్యంలో ఇరాన్‌పై జరుగుతున్న దాడులపై రష్యా తీవ్రంగా స్పందించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఈ దాడులను ఆపాలని కోరింది. దాడులు ఆపకపోతే భయంకరమైన పరిణామాలు ఉంటాయని రష్యా ఆయా దేశాలను హెచ్చరించింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని రష్యా పేర్కొంది. ఈ సైనిక చర్యలు ప్రాంతీయ శాంతికి పెద్ద ముప్పుగా మారతాయని హెచ్చరించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా పెను విపత్తు సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని రష్యా విదేశాంగ శాఖ సూచించింది. లేనిపక్షంలో యుద్ధం మరిన్ని దేశాలకు వ్యాపించే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

ఇదిలా ఉండగా ఇరాన్‌కు మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగారు.ఎర్రసముద్రం నుంచి ప్రయాణించే నౌకలపై దాడి చేస్తామని హౌతీలు హెచ్చరించారు. కాగా ఎర్రసముద్రం, హార్మూజ్ జలసంధి బ్లాక్ చేస్తే భారత్‌పై పెను ప్రభావం పడే అవకాశం ఉంది.భారత్‌లో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అందోళన వ్యక్తమవుతోంది.గల్ఫ్ యుద్ధంతో ఇప్పటికే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇవాళ ఒక్కరోజే వెండి కిలో 25వేలు పెరిగింది.  

తమపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించిన ఇరాన్‌ అదే స్థాయిలో రెచ్చిపోయింది. ఒకేసారి 9 దేశాలపై మిస్సైల్స్‌తో  అటాక్ చేసింది. ముఖ్యంగా అమెరికాకు యుద్ధ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఇజ్రాయెల్, బహ్రెయిన్, ఖతర్, కువైట్‌..అబుదాబి, జోర్డాన్, సౌదీ, దుబాయ్‌, ఇరాక్‌లపై బాంబుల వర్షం కురిపించింది. అబుదాబి, దుబాయ్‌లలో ఇరాన్ భారీ పేలుళ్లకు పాల్పడింది. మరోవైపు ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులు నిర్వహిస్తోంది.అమెరికా క్షిపణి దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి చెందినట్లు వార్తలు వస్తు్న్నాయి.

Advertisment
తాజా కథనాలు