/rtv/media/media_files/2026/04/09/latest-news-in-telugu-2026-04-09-17-38-57.jpg)
CPTO..Prasanna Prasad
VerSe Innovation : డైలీహంట్ (Dailyhunt) జోష్ (Josh) వంటి ప్రసిద్ధ యాప్‌ల మాతృ సంస్థ వెర్సే ఇన్నోవేషన్ (VerSe Innovation) తమ నూతన చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) గా ప్రసన్న ప్రసాద్‌ను నియమించింది. ఈ రోజు (ఏప్రిల్ 9, 2026)న ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.
వెర్సే ఇన్నోవేషన్ తన ఇంజనీరింగ్, ఏఐ విభాగాలకు నాయకత్వం వహించడానికి ప్రసన్న ప్రసాద్‌ను చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO)గా నియమించినట్లు వెల్లడించింది. కంటెంట్ అభివృద్ధి, ప్రకటనల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, డైలీహంట్, జోష్‌లలో ఏజెంటిక్ ఏఐని అభివృద్ధి చేయడంపై ప్రసాద్ దృష్టి సారిస్తారు. కంపెనీ తదుపరి దశఅయిన ఇంటెలిజెంట్ వృద్ధికి ఆయనకున్న అపారమైన నైపుణ్యం కీలకమని సహ వ్యవస్థాపకుడు ఉమాంగ్ బేడి పేర్కొన్నారు. ప్రసన్న ప్రసాద్ కంపెనీ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ , డేటా సైన్స్ విభాగాలకు నాయకత్వం వహిస్తారు. వెర్సే ప్లాట్‌ఫారమ్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆవిష్కరణలను వేగవంతం చేయడం, మోనిటైజేషన్ (ఆదాయ మార్గాలను) మెరుగుపరచడం ఇతని ప్రధాన లక్ష్యం.
వ్యూహాత్మక నిర్ణయం
వెర్సే ఇన్నోవేషన్ తన యాప్‌లలో "ఇంటెలిజెన్స్ లేయర్"ను మరింతగా విస్తరించాలని చూస్తున్న తరుణంలో ఈ నియామకం జరిగింది. వినియోగదారుల కోసం కంటెంట్ వ్యక్తిగతీకరణను మెరుగుపరచడం, నాణ్యమైన క్రియేటర్ ప్రొడక్షన్ కోసం టూల్స్‌ను క్రమబద్ధీకరించడం, ప్రకటనల సామర్థ్యాన్ని పెంచడం వంటి బాధ్యతలను ప్రసాద్‌కు అప్పగించారు. బ్రాండ్‌లు, ప్రకటనకర్తల కోసం తదుపరి తరం మానిటైజేషన్‌ను నడిపించడానికి "ఏజెంటిక్ ఏఐ" వ్యవస్థలు , ఆటోమేషన్‌ను అమలు చేయడం ఆయన బాధ్యతల్లోని ఒక ముఖ్యమైన అంశం. గవర్నెస్‌ను బలోపేతం చేయడానికి వెర్సే ఇన్నోవేషన్, డెలాయిట్ ఇండియా మాజీ చీఫ్ పీఆర్ రమేష్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించింది.
2 దశాబ్దాల టెక్ నాయకత్వ అనుభవం
ప్రసాద్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ , డేటా సైన్స్‌లో 20 సంవత్సరాలకు పైగా అనుభవంతో వెర్స్ (VerSe)లో చేరారు . ఆయనకు భారతదేశం, యూఎస్ ,యూరప్‌లలో గ్లోబల్ టీమ్‌లను నిర్వహించిన అనుభవం ఉంది. అలాగే, హై-స్కేల్ రియల్-టైమ్ సిస్టమ్స్, క్లౌడ్-నేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఈ పదవికి ముందు, ఆయన వెర్వ్ గ్రూప్ ఇంక్‌లో సీటీఓ (CTO) ,హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ ఏఐ (AI)గా పనిచేశారు. అక్కడ తన పదవీకాలంలో, ఆయన ప్రైవసీ-ఫస్ట్ అడ్వర్టైజింగ్ సిస్టమ్స్, ప్లాట్‌ఫామ్ ఆటోమేషన్‌పై దృష్టి సారించి, 200 మందికి పైగా నిపుణులతో కూడిన బృందానికి నాయకత్వం వహించారు. ఆయన ఇన్‌మొబి (InMobi), అమెజాన్ (Amazon),యాహూ (Yahoo) వంటి ఇతర ప్రధాన టెక్ సంస్థలలో కూడా కీలక పదవులను నిర్వహించారు.
వెర్సే ఇన్నోవేషన్ సహ వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ మాట్లాడుతూ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వృద్ధిలో AI ఒక కీలక మార్పు అని, ప్రసన్న ప్రసాద్ అనుభవం కంపెనీని తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమాంగ్ బేడి , తమ సంస్థ విస్తరిస్తున్న క్రమంలో ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక మార్పును ప్రముఖంగా ప్రస్తావించారు. "డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించడం, విస్తరించడం . వాటి ద్వారా ఆదాయం సంపాదించడంలో ఏఐ (AI) కీలక పాత్ర పోషిస్తోంది. మేము దీనిని ఒక నిర్మాణాత్మక మార్పుగా చూస్తున్నాము, ఇది కంటెంట్, క్రియేటర్లు , అడ్వర్టైజింగ్ రంగాలలో తదుపరి వృద్ధి దశను సుగమం చేస్తుంది. ప్రసన్నకు ఇంజనీరింగ్, డేటా సైన్స్ ,ఏఐ-ఆధారిత ప్లాట్‌ఫారమ్ పరివర్తనలో అపారమైన అనుభవంతో పాటు, అధిక-స్థాయి, గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే సిస్టమ్‌లను నిర్మించడంలో బలమైన ట్రాక్ రికార్డ్ కూడా ఉంది." అన్నారు.
వెర్సే ఇన్నోవేషన్ వృద్ధి గురించి
భారతదేశంలోని డిజిటల్ అంతరాన్ని పూడ్చే లక్ష్యంతో స్థాపించబడిన వెర్స్ ఇన్నోవేషన్ , దేశంలోనే మొట్టమొదటి "భారత్-కేంద్రీకృత" టెక్ యూనికార్న్‌గా అవతరించింది. దీని సొంత AI , మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలు లక్షలాది వినియోగదారులకు స్థానిక కంటెంట్‌ను అందిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్,ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ వంటి ప్రధాన ప్రపంచ పెట్టుబడిదారుల మద్దతుతో, ఈ కంపెనీ ఇటీవల FY25కు 88% ఆదాయ వృద్ధిని సృష్టించింది. FY26 ద్వితీయార్థం నాటికి గ్రూప్-స్థాయి లాభదాయకత దిశగా స్పష్టమైన మార్గంలో నడుస్తోంది.
Follow Us