POK : పాకిస్తాన్ ఏం దాస్తోంది?

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, మళ్లీ అగ్నిగుండంలా మారింది. వీధుల్లో వేలాది మంది నినాదాలు. ఆందోళనలు. భద్రతా బలగాలతో ఘర్షణలు. మరణాలు. గాయాలు.ఇంటర్నెట్ ఆంక్షలు. POKలో ప్రజలు నిజంగా ఏం కోరుకుంటున్నారు? ఇది స్వాతంత్య్ర ఉద్యమమా? పాకిస్తాన్ వ్యతిరేక తిరుగుబాటా?

New Update
FotoJet - 2026-06-10T181205.904

POK Asking For Freedom From Pakistan?

ravi-prakash-2026-05-27-18-35-07

-RAVI PRAKASH

POK : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, మళ్లీ అగ్నిగుండంలా మారింది. వీధుల్లో వేలాది మంది నినాదాలు. ఆందోళనలు. భద్రతా బలగాలతో ఘర్షణలు. మరణాలు. గాయాలు.  ఇంటర్నెట్ ఆంక్షలు. ఇప్పటికే చాలా అరెస్టులు జరిగాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే..కశ్మీర్ పేరుతో ప్రపంచం ముందు భారతదేశాన్ని విమర్శించే పాకిస్తాన్.ఇప్పుడు అదే కశ్మీర్‌లో తనకే వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఎందుకు ఆపలేకపోతోంది? POKలో ప్రజలు నిజంగా ఏం కోరుకుంటు న్నారు? ఇది స్వాతంత్య్ర ఉద్యమమా? పాకిస్తాన్ వ్యతిరేక తిరుగుబాటా? లేక ఇంకేదైనా పెద్ద కథ ఉందా? ఈరోజు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.



ఈసారి వివాదం మొదలైంది ఒక కోర్టు తీర్పుతో. పాకిస్తాన్ పరిపాలనలో ఉన్న కశ్మీర్ అసెంబ్లీలో 12 సీట్లను, పాకిస్తాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థులకు కేటాయించారు. ఈ వ్యవస్థ కొత్తది కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. కానీ స్థానిక ప్రజల ప్రశ్న ఒక్కటే."మా ప్రాంతంలో నివసించని వాళ్లు... మా రాజకీయ భవిష్యత్తు ఎందుకు నిర్ణయించాలి?" అదే డిమాండ్‌తో ఉద్యమం చేస్తున్న JAAC అనే సంస్థ... ఆ సీట్లను రద్దు చేయాలని కోరింది.అయితే, కోర్టు ఆ డిమాండ్‌ను తిరస్కరిం చింది. ఎన్నికలకు ముందు వచ్చిన ఈ తీర్పు...ప్రజల్లో ఉన్న అసంతృప్తికి మరింత ఆజ్యం పోసింది.దీంతో, ఒక్కసారిగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి.భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.  అక్కడినుంచే పరిస్థితి అదుపు తప్పింది.

అసలు JAAC అంటే ఏంటి? అంటే Joint Awami Action Committee. ఇది రాజకీయ పార్టీ కాదు. ప్రజా సంఘాల కూటమి. వ్యాపారులు. సామాజిక కార్యకర్తలు. పౌర సంఘాలు. వివిధ ప్రజా సంస్థలు. అందరూ కలిసి ఏర్పరచుకున్న వేదిక.ఇవాళ POKలో అత్యంత ప్రభావవంతమైన ప్రజా ఉద్యమంగా మారింది.వాళ్లు మాట్లాడేది సిద్ధాంతాల గురించి కాదు. ప్రజల రోజువారీ సమస్యల గురించి. కరెంట్ బిల్లులు. ఇన్‌ఫ్లేషన్‌. గోధుమ పిండి ధర.నిరుద్యోగం.  స్థానిక హక్కులు మాత్రమే.ఇవి సాధారణ ప్రజల జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే అంశాలు. అసలు సమస్య శరణార్థుల సీట్లు కాదు.

ఇక్కడ చాలా మంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే..ఈ ఉద్యమం కేవలం ఆ 12 సీట్ల గురించి అనుకోవడం. కానీ అది కానేకాదు. అది కేవలం ట్రిగ్గర్ మాత్రమే.నిజమైన సమస్య ఏంటంటే? ఏళ్ల తరబడి పేరుకుపోయిన అసంతృప్తి. అవును, POKలో భారీగా జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ స్థానికుల వాదన ఏంటంటే..."విద్యుత్ మాది... కానీ ఆదాయం మాకు రావడం లేదు."దీనికి తోడు, ఊహించని స్థాయిలో కరెంట్ బిల్లులు.పెరుగుతున్న ఆహార ధరలు. నిరుద్యోగం.  అభివృద్ధి అవకాశాల కొరత.ఇవన్నీ కలిసి ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని పెంచాయి. అందుకే ఇప్పుడు శరణార్థులు అధికారాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇంతకూ, POKను ఎవరు పాలిస్తున్నారు?  స్థానికులా? లేక ఇస్లామాబాద్‌లో కూర్చున్న అధికారులా?
 
POKలో ఆందోళనలు పెరుగుతున్న కొద్దీ...ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. JAACను ఉగ్రవాద నిరోధక చట్టాల కింద BANED ORGANISATIONగా ప్రకటించింది. మరోవైపు, నాయకుల అరెస్టులు. దేశద్రోహం కేసులు. భారీ భద్రతా మోహరింపు.  ఇంటర్నెట్ ఆంక్షలు..ఒకటేంటి POKను నిర్బంధించినంత పని చేశారు. కానీ ఇక్కడ ఒకే ఒక ప్రశ్న. ప్రజల సమస్యల గురించి మాట్లాడే సంస్థను..ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తే.. ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారు? అదే జరిగింది.  ఉద్యమంలో లేని చాలా మంది కూడా..ఇప్పుడు ప్రభుత్వ చర్యలను ప్రశ్నించడం మొదలుపెట్టారు.
 
ఇక్కడే అసలు పొలిటికల్ టెన్షన్ మొదలవుతోంది.  ఎందుకంటే.. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ భారత్‌పై విమర్శలు చేస్తుంది. సేమ్‌ టైమ్‌ ప్రపంచానికి ఒక మెసేజ్‌ కూడా ఇస్తోంది..అదేంటంటే.  "మా పరిపాలనలోని కశ్మీర్ చాలా మెరుగ్గా ఉంది" అని.కానీ ఇప్పుడు ప్రపంచం ఏం చూస్తోంది? ముజఫరాబాద్‌లో ఆందోళనలు.  రావల్‌ కోట్‌లో నిరసనలు. కశ్మీరీలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రజలతో ఘర్షణ పడుతున్నాయి. ఇది కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య కాదు.ఇది రాజకీయంగా కూడా పెద్ద సవాల్‌. అయితే, ఇక్కడో ప్రశ్న రైజ్అవుతోంది. ఇది ఫ్రీడమ్ కోసం పోరాటమా? అనే చర్చ కూడా తలెత్తింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం రెండు స్టోరీలు వినిపిస్తున్నాయి.  ఒకవైపు."POK పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటోంది" అంటున్నారు.మరోవైపు.."ఇది భారత్‌ అనుకూల ఉద్యమం" అంటున్నారు.కానీ  గ్రౌండ్ రియాల్టీని అంచనా వేయడం అంత సులభం కాదు. 
 
ప్రస్తుతం POK ప్రజలు కోరుతున్న డిమాండ్స్‌ ఏంటంటే? రాజకీయ హక్కులు.  న్యాయమైన ప్రాతినిధ్యం. ఆర్థిక న్యాయం. స్థానిక స్వయంపాలన. పరిపాలనా సంస్కరణలు. ఈ డిమాండ్లు స్థానికమైనవి. భారత్‌కు అనుకూలమైనవి. అలాగే దీన్ని ఇండిపెండెన్స్‌ కోసం పోరాటం అని కూడా చెప్పలేం..ఒక విషయం గమనించాలి. పీఓకేలో మళ్లీ మళ్లీ అదే పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? 2024లో ఉద్యమాలు జరిగాయి.2025లో కూడా ఉద్రిక్తతలు కనిపించాయి.ఇప్పుడు 2026లో మళ్లీ అదే రక్తపాతం.ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే..వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.  అరెస్టులు చేస్తే నాయకులు కనిపించకపోవచ్చు. ఇంటర్నెట్ నిలిపేస్తే సమాచారం ఆగిపోవచ్చు.  కానీ ప్రజల సమస్యలు మాయం కావు.అందుకే ఉద్యమం మళ్లీ మళ్లీ తిరిగి వస్తోంది.
 
చివరిగా..

POKలో మళ్లీ మంటలు ఎందుకు చెలరేగాయి?  ఒక్క కోర్టు తీర్పు వల్ల కాదు. ఒక్క సంస్థ వల్ల కాదు. ఒక్క నిరసన వల్ల కూడా కాదు.ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఆర్థిక సమస్యలు. రాజకీయ అసంతృప్తి. ప్రాతినిధ్యం కోసం డిమాండ్లు. ఇవన్నీ కలిసి ఇప్పుడు పెద్ద సంక్షోభంగా మారాయి. శరణార్థుల సీట్ల వివాదం కేవలం నిప్పురవ్వ మాత్రమే. కానీ ఈరోజు మంటలకు రగులుతున్న చారిత్రక నేపథ్యం ఉంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.  ఇస్లామాబాద్ కశ్మీర్‌ ప్రజల మాట వింటుందా? లేక మరింత కఠిన చర్యలకు, అణచివేతకు దిగుతుందా? దీనికి వచ్చే సమాధానమే..POK భవిష్యత్తును నిర్ణయించబోతోంది.

Advertisment
తాజా కథనాలు