/rtv/media/media_files/2026/02/07/trump-and-modi-2026-02-07-13-37-44.jpg)
Pm Modi Speaks To Donald Trump
Pm Modi Speaks To Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మనదేశ ప్రధాని నరేంద్రమోడీ కాల్ చేశారు. వారిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే. దీంతో మళ్లీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వీరిద్దరూ మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ఇరాన్ అమెరికా యుద్ధం కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో సముద్ర మార్గాలను అమెరికా దిగ్బంధనం చేసింది.దీనివల్ల భారతదేశంతో పాటు అనేక ప్రపంచ దేశాలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో మోదీ యుద్ధానికి సంబంధించి పలు అంశాలపై ట్రంప్‌తో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, యుద్ధం మళ్లీ పెరగకుండా నియంత్రించడం వంటి అంశాలపై మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా- ఇరాన్ చర్చలు మరోసారి జరిగే అవకాశం ఉండటంతో తదుపరి దౌత్య చర్యలు ఎలా ఉండాలి అన్న అంశాలపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో స్పష్టం చేశారు.
Follow Us