/rtv/media/media_files/2026/06/15/pakistan-2026-06-15-15-09-24.jpg)
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది.పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్ప కూలింది. ప్రమాదంలో స్పాట్‌లోనే ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. వారిని ఫ్లైట్ లెఫ్టినెంట్ ముహమ్మద్ ఖాసిం అబ్దుల్లా, లెఫ్టినెంట్ తాహా అబ్బాసిగా గుర్తించారు. ఖైబ్ పఖ్తుంఖ్వాలోని మర్దాన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రొటీన్ ట్రైనింగ్‌లో ఉండగా ఎయిర్‌క్రాఫ్ట్ ఒక్కసారిగా కుప్ప కూలింది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఎయిర్‌క్రాఫ్ట్ కూలడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
పౌరులకు తీవ్ర గాయాలు
ఈ క్రమంలో పలువురు పౌరులకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు వైమానిక ప్రధాన కార్యాలయం ఒక విచారణ బోర్డును ఏర్పాటు చేసింది. ప్రమాదానికి గల కారణంపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రాథమిక వివరాలను వెల్లడించలేదు. విధి నిర్వహణలో సైనిక సిబ్బంది చేసిన త్యాగాలకు సాయుధ దళాలు నివాళులర్పించాయి. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ , అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ ఘోర ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేశారు.
❗Two Pakistani Air Force Pilots killed in a PLANE CRASH in Miranshah, Pakistan — Tasnim
— G S (@gsleg) June 15, 2026
Two civilians were also injured in the incident and were transported to a nearby hospital pic.twitter.com/h6UsGhNdnt
శిక్షణా విమానం కూలిపోవడంతో, పాకిస్థాన్‌లో ఐదు రోజుల్లో నమోదైన రెండవ సైనిక విమాన ప్రమాదం నమోదైంది. జూన్ 10న, టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ముజఫరాబాద్ సమీపంలో పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కూలిపోయింది. అధికారులు ఈ రెండు ఘటనలపై ఇంకా దర్యాప్తు చేస్తున్నప్పటికీ, వరుసగా జరిగిన ఈ ప్రమాదాలు విమానయాన భద్రత, సైనిక విమాన కార్యకలాపాలలోని కార్యాచరణపరమైన నష్టాలపై ఆందోళనలను రేకెత్తించాయి.
Follow Us