/rtv/media/media_files/2026/02/28/gold-2026-02-28-20-46-04.jpg)
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను ఒక్కసారిగా వణికించేస్తోంది. యుద్ధం వచ్చిందంటే చాలు.. ఎక్కడ తమ డబ్బు మునిగిపోతుందో అని భయపడే ఇన్వెస్టర్లంతా షేర్ మార్కెట్ల నుంచి వెనక్కి తగ్గి, తమ పెట్టుబడులను బంగారం, వెండి మీద పెట్టడానికి పోటీ పడుతుంటారు. అందుకే ఇప్పుడు పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే యుద్ధ సెగతో బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగిపోగా, రానున్న రోజుల్లో ఇవి మరింత ప్రియం కానున్నాయని మార్కెట్ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.
ముఖ్యంగా సోమవారం మన దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. యుద్ధ భయం వల్ల ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న షేర్లను విక్రయించడానికి మొగ్గు చూపుతారని, దీనివల్ల మార్కెట్లు కుప్పకూలవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవైపు షేర్ మార్కెట్ పడిపోతుంటే, మరోవైపు బంగారం ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లేలా కనిపిస్తోంది.
ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ కావడంతో, ఈ ధరల పెరుగుదల సామాన్య కుటుంబాల బడ్జెట్‌ను పూర్తిగా తలకిందులు చేయనుంది. యుద్ధం ఎంత ముదిరితే పసిడి పరుగు అంత వేగంగా ఉంటుందని, వెండి కూడా అదే బాటలో నడుస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే రూ.1,62,000 దాటేసింది.
ప్రస్తుతం ఉన్న అప్‌డేట్స్ ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు $5,300 మార్కుకు చేరువలో ఉంది. మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర ఇప్పటికే రూ.1,62,000 దాటేసింది. ఒకవేళ యుద్ధం గనుక మరింత ముదిరితే, ఇది త్వరలోనే రూ.1.70 లక్షల వరకు వెళ్లవచ్చు. వెండి పరిస్థితి కూడా అలాగే ఉంది.. కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.10,000 పెరిగి రూ.2,95,000 వద్ద ట్రేడ్ అవుతోంది. యుద్ధం గనుక మరింత ముదిరితే, వెండి రూ.3.20 లక్షలను దాటేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే, మన రూపాయి విలువ పడిపోతుంది. మనం బంగారాన్ని వేరే దేశాల నుండి కొంటాం కాబట్టి, రూపాయి విలువ తగ్గితే మనం బంగారం కోసం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల మన దేశంలో బంగారం రేట్లు మరింత పెరుగుతాయి.
Follow Us