Trump peace claims Iran :.ఒకవైపు శాంతి చర్చలంటూనే...మరోవైపు ఇరాన్ పై బాంబుల వర్షం

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఐదు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్‌ పై దాడులు మాత్రం ఆగడం లేదు. 5 రోజులపాటు ఆ దేశంపై దాడులు చేయవద్దని ట్రంప్‌ తన బలగాలకు ఆదేశాలిచ్చినప్పటికీ దాడులు మాత్రం ఆగలేదు.

New Update
Trump

Trump

(Trump peace claims Iran :. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఐదు రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్‌ పై దాడులు మాత్రం ఆగడం లేదు. ఇరాన్‌తో గత రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయని.. అందువల్ల వచ్చే 5 రోజులపాటు ఆ దేశంపై దాడులు చేయవద్దని ట్రంప్‌ తన బలగాలకు ఆదేశాలిచ్చినప్పటికీ దాడులు మాత్రం ఆగలేదు. మంగళవారం రాత్రి ఇరాన్‌లోని పలు నగరాలపై అమెరికా -ఇజ్రాయెల్ బలగాలు దాడులు కొనసాగించాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో మంగళవారం రాత్రి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి తబ్రిజ్, ఇస్ఫహాన్, కరాజ్ నగరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగాయి. ఇస్ఫహాన్‌లోని గ్యాస్ వ్యవస్థ, ఖొర్రమ్‌షహర్‌లోని పవర్ ప్లాంట్‌లను క్షిపణులు, డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. కాగా ఇజ్రాయెల్ఈ దాడి చేసి ఉంటుందని ఇరాన్ భావిస్తోంది. అయితే ఈ దాడులపై అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటివరకు స్పష్టతనివ్వకపోవడం గమనార్హం.

అయితే అంతకు ముందు ట్రంప్‌ మాట్లాడుతూ ఇరాన్‌ పై దాడులు ఆపాలని తన బలగాలకు ఆదేశాలిచ్చినట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రక టించారు. ‘మధ్య ఆసియాలో శత్రుత్వానికి పూర్తిగా పరిష్కారం కనుగొనేందుకు అమెరికా, ఇరాన్‌ మధ్య రెండు రోజులుగా నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయి. వారంపాటు ఈ చర్చలు విస్తృతంగా కొనసాగేందుకు వీలుగా దాడులు ఆపేస్తామని ట్రంప్‌ తెలిపారు. ఇరాన్ పై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే అంతర్జాతీయంగా కాస్త ఉపశమనం లభించింది. పలు దేశాలు స్టాక్ మార్కెట్లు, బంగారం ధరలు, చమురు ధరలు కొంతమేరకు కోలుకున్నాయి.

యుద్దం విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గినట్లు అనిపించినా ఇజ్రాయెల్‌ మాత్రం ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు ఇజ్రాయెల్‌పై 78వ విడత దాడులను ప్రారంభించినట్టు ఐఆర్‌జీసీ ప్రకటించడం గమనార్హం. ఇజ్రాయె‌లోని టెల్ అవివ్, డిమోనా, ఇలాట్‌తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తాము దాడులు చేస్తున్నట్టు తెలిపింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన పలు ప్రాంతాలు ధ్వంసమైనట్టు తెలిపింది. మంగళవారం ఉదయం నుంచి పలు ఇజ్రాయెల్‌ నగరాల్లో సైరన్ల మోత మోగుతుండటం యుద్ధ తీవ్రతను తెలుపుతుంది.

Advertisment
తాజా కథనాలు