🔴 Myanmar Earthquake Live Updates: బ్యాంకాక్ లో భూకంపం.. ఎమెర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. లైవ్ అప్డేట్స్!

బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి (Emergency)ని ప్రకటించింది.

author-image
By Nikhil
New Update
Bangkok Earthquake

Bangkok Earthquake

🔴Myanmar Earthquake Live Updates:

బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి (Emergency)ని ప్రకటించింది. ఈ భూకంపం ధాటికి పలు బిల్డింగ్స్ ఊగిపోయాయి. ఓ బహుళ అంతస్తుల భవనం నేలమట్టమైంది. చుట్టుపక్కల జనం భయంతో రోడ్లమీదికి పరుగులు తీశారు. జర్మనీకి చెందిన GFZ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ శుక్రవారం మధ్యాహ్నం భూకంపం సంభవించిదని ప్రకటన చేసింది.

Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

సెంట్రల్ మయన్మార్‌లోని మోనివా సిటీకి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 12 నిమిషాల వ్యవధిలోని మయన్మార్‌లో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.7గా నమోదైంది. దీని ప్రభావంతోనే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో రెండుసార్లు తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 

Also Read: అమెరికాతో ఆ బంధం ముగిసింది.. ఇక ప్రతి చర్య తప్పదు: కెనడా!

ఈ భూకంప ప్రభావం ఆగ్నేసియా దేశాలపై కూడా కనిపించింది. భారత్‌లోని ఢిల్లీ ఎన్సీర్, కోల్‌కతా, ఇంఫాల్, మేఘాలయాలో స్వల్పంగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.మేఘాలయ ఈస్ట్‌గారో హిల్స్‌ రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. బంగ్లాదేశ్‌లో 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లు సమాచారం.  

Also Read: Mosquitoes: మనిషి రక్తాన్ని విషంగా మార్చి.. దోమల్ని చంపే ప్రయోగంలో సైంటిస్టులు సక్సెస్

Also Read: Microplastics: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!

  • Mar 28, 2025 17:58 IST

    Earthquake: ఎత్తైన భవనం కూలిన ఘటనలో 90మంది మిస్సింగ్ ..

    బ్యాంకాక్‌లో భూకంపం సంభవించడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఎత్తైన భవనం పేకమేడలా కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు థాయ్‌లాండ్ రక్షణశాఖ మంత్రి వెల్లడించారు. మరో 90 గల్లంతయినట్లు పేర్కొన్నారు.

    Earthquake in Bangkok
    Earthquake in Bangkok

     



  • Mar 28, 2025 15:11 IST

    Earthquake: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు

    థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించడం కలకలం రేపుతోంది.నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ భవనం కూలిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తి ఆర్తనాదాలు చేసిన ఓ వీడియో వైరలవుతోంది.

    Earthquake in Bangkok
    Earthquake in Bangkok

     



  • Mar 28, 2025 14:52 IST

    Earthquake: బ్యాంకాక్‌లో భూకంపం ఎఫెక్ట్.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం

    బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. దీంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితి (Emergency)ని ప్రకటించింది.

    Emergency in bangkok
    Emergency in bangkok

     



  • Mar 28, 2025 14:52 IST

    BIG BREAKING: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు

    థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కుదుపులకు గురవ్వడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్ర ఉందని సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.

    Earthquake in Bangkok
    Earthquake in Bangkok Photograph: (Earthquake in Bangkok)

     



  • Mar 28, 2025 14:49 IST

    Myanmar Earthquake Live Updates:



  • Mar 28, 2025 14:49 IST

    Myanmar Earthquake Live Updates:



  • Mar 28, 2025 14:48 IST

    Myanmar Earthquake Live Updates:



  • Mar 28, 2025 14:48 IST

    Myanmar Earthquake Live Updates:



  • Mar 28, 2025 14:47 IST

    Myanmar Earthquake Live Updates:



  • Mar 28, 2025 14:39 IST

    వైరల్ అవుతున్న భూకంపం వీడియోలు



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sunitha Williams: అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా కనిపించింది..సునీతా విలియమ్స్

అంతరిక్ష అనుభవాలను మీడియాతో పంచుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భారత దేశం గురించి కూడా స్పందించారు. ఇండియా మహా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించారు. త్వరలోనే భారత్ కు వస్తానని తెలిపారు. 

New Update

ఐఎస్ఎస్ నుంచి తిరిగి వచ్చాక సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు 12 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తాము కోలుకుంటున్నామని...నాసా బృందం తమకు శిక్షణ ఇస్తోందని చెప్పారు. ఇప్పుడు మామూలుగాను నడగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. దాంతో పాటే తమ  ఐఎస్ఎస్ లో తమ అనుభవాలు, అక్కడ ఏం చేశారు. స్పేస్ ఎక్స్ పని తీరు గురించి అన్నీ వివరంగా చెప్పారు వ్యోమగాములు. మళ్ళీ అవకాశం వస్తే స్టార్ లైన్ షిప్ లో ఐఎస్ఎస్ కు వెళ్ళడానికి రెడీ అని తెలిపారు. 

ఇండియా చాలా బావుంది..

అంతరిక్షం నుంచి భారత్ ఏ విధంగా కనిపించింది అన్న ప్రశ్నకు సునీతా విలియమ్స్...అద్భుతంగా ఉంది అంటూ సమాధానం చెప్పారు. భారతదేశ ప్రకృతి దృశ్యాన్ని చూసి ముగ్ధురాలైనట్లు తెలిపారు. హిమాలయాలను దాటుకుని వెళుతుంటే మైమరిచిపోయానని సునీతా అన్నారు.  ఆ దృశ్యాలను బెచ్ విల్ మోర్ కెమెరాలో బంధించామని తెలిపారు. గుజరాత్, ముంబై ప్రాంతాల మీదగా వెళ్లినప్పుడు జాలర్ల పడవలు సిగ్నల్‌లాగా కనిపించాయని అన్నారు. భారత్ లో తొందరలోనే పర్యటిస్తానని సునీతా అన్నారు. తన తండ్రి పుట్టిన దేశాన్ని త్వరలోనే చూస్తానని, బంధువులను, ప్రజలను కలుస్తానని సునీతా చెప్పారు. భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. భారత అంతరిక్ష యాత్రలో భాగం కావడానికి, సాయం చేయడానికి తాను సిద్దమేనని ఆమె అన్నారు. 

today-latest-news-in-telugu | nasa | sunitha-williams | astronauts

Also Read: Myanmar: మసీదుల్లో ప్రార్థన చేస్తూ 700 మంది మృత్యువు.. 2వేలకు పైనే..

Advertisment
Advertisment
Advertisment