/rtv/media/media_files/2026/04/12/uganda-2026-04-12-13-34-42.jpg)
ఉగాండా దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. టర్కీ దేశం తమకు వెంటనే ఒక బిలియన్ డాలర్లు అంటే సుమారు 8,300 కోట్లు చెల్లించాలని, దాంతో పాటు ఆ దేశంలోనే అత్యంత అందమైన మహిళను తనకు భార్యగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సోమాలియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరాడటానికి ఉగాండా ఎన్నో ఏళ్లుగా రక్షణ కల్పిస్తోందని, కానీ దాని వల్ల టర్కీ మాత్రం వ్యాపార ఒప్పందాలు చేసుకుంటూ లాభపడుతోందని ఆయన ఆరోపించారు. అందుకే ఉగాండా సైన్యం చేసిన సేవలకు ప్రతిఫలంగా ఈ నగదు చెల్లించాలని ఆయన కోరుతున్నారు.
In a bizarre demand, Uganda's army chief, Muhoozi Kainerugaba, has asked Turkey for $1 billion for its role in Somalia and also demanded that the most beautiful Turkish woman be given to him as his wife. In 2022, Kainerugaba had demanded the hand of Italian PM Giorgia Meloni in… pic.twitter.com/iFPMgeQkSg
— IndiaToday (@IndiaToday) April 12, 2026
30 రోజుల్లోపు తీర్చకపోతే
ఒకవేళ టర్కీ ఈ డిమాండ్లను 30 రోజుల్లోపు తీర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కైనెరుగాబా హెచ్చరించారు. అంతేకాకుండా ఉగాండా రాజధాని కంపాలాలో ఉన్న టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని, అలాగే టర్కీ విమానాలు తమ గగనతలంపై ఎగరకుండా నిషేధిస్తామని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఉగాండా ప్రజలు ఎవరూ టర్కీకి ప్రయాణించవద్దని, అది క్షేమం కాదని కూడా ఆయన సలహా ఇచ్చారు. ఇవే కాకుండా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా తాను స్వయంగా లక్ష మంది సైనికులను పంపి ఆ పవిత్ర భూమిని రక్షిస్తానని కూడా ఆయన ప్రకటించారు.
జనరల్ ముహూజీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని పెళ్లి చేసుకునేందుకు 100 ఆవులను ఇస్తానని ఆఫర్ ఇచ్చి అప్పట్లో సంచలనం సృష్టించారు. ఒకవేళ ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తే రోమ్ నగరాన్ని ఆక్రమిస్తామని కూడా బెదిరించారు. గతంలో కెన్యా రాజధాని నైరోబీని కూడా రెండు వారాల్లో తమ సైన్యం ఆక్రమిస్తుందని ఆయన అనడంపై ఉగాండా అధ్యక్షుడు, ముహూజీ తండ్రి అయిన యోవేరి ముసెవెనీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం టర్కీపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఆ దేశం ఇంకా స్పందించలేదు.
Follow Us