Britain Royal Family: రాజభవనంలో దొంగలు పడ్డారు! బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఓ భవనంలో దొంగలు పడ్డారు. ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు అప్పుడప్పుడు సేద తీరే విండ్సర్ క్యాజిల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.ఫెన్సింగ్ దూకి ఎస్టేట్‌లోకి ప్రవేశించిన దొంగలు ఓ ట్రక్కు,బైక్‌ను ఎత్తికెళ్లినట్లు తెలుస్తోంది. By Bhavana 18 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Britan: అత్యంత భద్రత ఉండే బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఓ భవనంలో దొంగలు పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు అప్పుడప్పుడు సేద తీరే విండ్సర్ క్యాజిల్ లో ఇటీవల భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఫెన్సింగ్ దూకి ఎస్టేట్‌లోకి ప్రవేశించిన దొంగలు ఓ ట్రక్కు,బైక్‌ను ఎత్తికెళ్లినట్లు తెలుస్తోంది. Also Read: Nara Rohit: కష్టకాలంలో పెదనాన్న అండగా నిలిచారు: నారా రోహిత్! ఆ సమయంలో రాజ దంపతులు అక్కడ లేనపప్పటికీ..ఈ ఘటన ఎస్టేట్ భద్రత పై అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది.దాదాపు నెల రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 13 ఆదివారం అర్థరాత్రి సమయంలో మాస్క్ ధరించిన ఇద్దరు దుండగులు ఆరు అడుగుల ఎత్తున్న ఫెన్సింగ్ ఎక్కి విండ్సర్ క్యాజిల్ ఎస్టేట్ లోకి దూకినట్లు బ్రిటన్ మీడియా కథనాలు వెల్లడించాయి. Also Read: Delhi: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..107 విమాన సర్వీసులు ఆలస్యం! క్యాజిల్ సెక్యూరిటీ జోన్ లో ఉండే ఓ ఫామ్ వద్దకు వెళ్లిన వీరు అక్కడ ఉన్న పిక్ అప్ ట్రక్కు, క్వాడ్ బైక్ ను దొంగిలించారు. అదేట్రక్కుతో వేగంగా ఎస్టేట్ సెక్యూరిటీ గేటును ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయినట్లు సదరుకథనాలు వెల్లడించాయి.సాధారణంగా ఎస్టేట్ లో అనుమానాస్పదంగా ఏం జరిగినా సెక్యూరిటీఅలారమ్ మోగుతుంది. Also Read: Ap: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కానీ , దుండగులు దోచుకుని పారిపోయే వరకు ఎలాంటి అలర్ట్ రాకపోవడం గమనార్హం. ఈ ఎస్టేట్ లో నిరంతర పెట్రోలింగ్ ఉంటుందని, అయితే దుండగులు కొన్ని రోజుల పాటు దీన్ని రెక్కీ చేసి చోరీకి పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వాహనాలు ఎక్కడ పార్క్ చేస్తారో కూడా వారికి ముందే తెలిసి ఉండొచ్చని చెబుతున్నారు. Also Read: High Court: భార్యను ఉద్యోగం మానేయమని బలవంతం చేయడం క్రూరత్వమే! కాగా...ఈ క్యాజిల్ కు కేవలం 5 నిమిషాల దూరంలో ఉండే అడిలైడ్ కాటేజీలో యువరాజు ప్రిన్స్ విలియమ్ , ఆయన సతీమణి కేట్ మిడిల్డన్ తమ ముగ్గురు చిన్నారులతో కలిసి ఉంటున్నారు. ఈ విండర్స్ క్యాజిల్ లో ప్రిన్స్ ఛార్లెస్ దంపతులు వారానికిరెండు రోజులు ఉంటారని రాయల్ ఫ్యామిలీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా దుండగులు ధ్వంసం చేసిన సెక్యూరిటీ గేట్‌నే రాజకుటుంబం తరచుగా వినియోగిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా విభాగాల అధికారులు పని చేస్తుంటారు. #Britain Royal Family #Burglary at Britain Royal Palace #britain royal palace మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి