Lockdown : పాకిస్థాన్‌లో లాక్‌డౌన్...ఇంధన సంక్షోభంతో విలవిల

ఇరాన్‌, అమెరికా యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ ఇంధన సమస్యను ఎదుక్కొంటున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లో నెలకొన్న ఇంధన సమస్యతో అక్కడి ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించక తప్పలేదు. రాత్రి 8:00 గంటలకే మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ క్లోజ్‌ చేయాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది.

New Update
FotoJet (5)

Lockdown in Pakistan

Lockdown : ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ ఇంధన సమస్యను ఎదుక్కొంటున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లో నెలకొన్న ఇంధన సమస్యతో అక్కడి ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించక తప్పలేదు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న యుద్ధం పాకిస్థాన్‌ను చీకట్లోకి నెట్టేసింది. హర్మూజ్‌ జలసంధి గుండా ఇంధన సరఫరాను ఇరాన అడ్డుకోవడంతో ఇంధన సరఫరా నిలిచిపోయి  ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది.. పాకిస్థాన్‌ వంటి దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో  దేశంలో నెలకొన్న తీవ్ర ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసరంగా దేశంలో "స్మార్ట్ లాక్ డౌన్" విధిస్తున్నట్లు ప్రకటించారు. చమురు, విద్యుత్ పొదుపు కోసం లాక్‌డౌన్ విధించక తప్పని పరిస్థితి అక్కడ నెలకొంది. రాత్రి 8:00 గంటలకే మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ క్లోజ్‌ చేయాలని ఆదేశించింది. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు, పెళ్లి వేడుకలకు 10 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు.

భారత్, నేపాల్ వంటి దేశాల్లోనూ ఇంధన సమస్య ఉన్నప్పటికీ ఈ సంక్షోభాన్ని తట్టుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాయి. అయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాక్ మాత్రం సమస్యను తట్టుకోలేక చేతులెత్తేసింది.  పాకిస్థాన్‌లోని పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్ సహా అన్ని ప్రధాన ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, వాణిజ్య కేంద్రాలను రాత్రి 8 గంటలకే మూసివేయాలని అధికారులు ఆదేశించారు.. కేవలం మెడికల్ షాపులు, ఫార్మసీలకు మాత్రమే రూల్స్ నుండి మినహాయింపును ఇచ్చారు. పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించి.. విద్యుత్తును ఆదా చేయడం కోసమే లాక్ డౌన్‌ విధిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో స్వల్ప సడలింపులు ఇచ్చినప్పటికీ.. డిపార్ట్‌మెంటల్ స్టోర్లు, మాల్స్ కు మాత్రం ఖచ్చితంగా 8 గంటలకే తాళాలు పడాల్సిందేనని తేల్చి చెప్పింది.

కాగా, ఇంధన సంక్షోభం తగ్గే వరకు లాక్‌డౌన్ కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. యుద్ధం వల్ల పాకిస్థాన్‌కు  చమురు సరాఫరా నిలిచిపోయింది. మరోవైపు పాకిస్థాన్‌ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడు తున్నది. పాకిస్థాన్‌లో  పెట్రోల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 4 రోజుల పని దినాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి 8 గంటల నుండే ఈ స్మార్ట్ లాక్ డౌన్ రూల్స్ పాకిస్థాన్ వ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.  

మరోవైపు ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని కొంత తగ్గించేందుకు గిల్గిత్, ముజఫరాబాద్ వంటి నగరాల్లో నెల రోజుల పాటు ప్రభుత్వం ఉచిత ప్రజా రవాణానుప్రకటించింది. దీనికి అయ్యే ఖర్చును అక్కడి గవర్నమెంట్ భరించనుంది. ఇరాన్- అమెరికా గొడవ సద్దుమణిగి ఇంధన సరఫరా పునరుద్ధరించబడే వరకు పాకిస్థాన్‌కు ఈ ఇబ్బందులు తప్పేలా లేవు. కాగా యుద్ధం ఇలాగే కొనసాగితే పాక్‌ ఆర్థిక వ్యవస్థ మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు