Israel Secret Military Base Iraq : ఇరాక్ దేశంలో ఇజ్రాయెల్ 'సీక్రెట్ మిలిటరీ బేస్'...ఎలా బయటపడిందో తెలిస్తే షాక్‌..

సాధారణంగా ఇరాక్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దశాబ్దాలుగా తీవ్ర శత్రుత్వం నడుస్తోంది. తన శత్రు దేశమైన ఇరాక్ గుండెల్లోనే ఇజ్రాయెల్ తన రహస్య సైనిక కేంద్రాన్ని (సీక్రెట్ మిలిటరీ బేస్) ఏర్పాటు చేసుకుందన్న వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

New Update
FotoJet - 2026-05-11T122741.698

Israel Secret Military Base Iraq

Israel Secret Military Base Iraq : సాధారణంగా ఇరాక్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దశాబ్దాలుగా తీవ్ర శత్రుత్వం నడుస్తోంది. ఈ రెండు దేశాలు ఇప్పటివరకు ఒకదానినొకటి స్వతంత్ర దేశాలుగా గుర్తించలేదు కూడా. అలాంటి శత్రు దేశమైన ఇరాక్ గుండెల్లోనే ఇజ్రాయెల్ తన రహస్య సైనిక కేంద్రాన్ని (సీక్రెట్ మిలిటరీ బేస్) ఏర్పాటు చేసుకుందన్న వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.ఈ రహస్య స్థావరంలో ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన ప్రత్యేక బలగాలు (స్పెషల్ ఫోర్స్) మోహరించడమే కాకుండా, ఇజ్రాయెల్ వైమానిక దళానికి (ఎయిర్ ఫోర్స్) ఇది ఒక కీలక లాజిస్టికల్ హబ్‌గా కూడా పనిచేసింది. ఇరాక్ ప్రభుత్వానికి కనీసం అనుమానం కూడా రాకుండా ఇన్నాళ్లూ సాగిన ఈ అతిపెద్ద రహస్యం ఇప్పుడు బహిర్గతం కావడంతో ఇరాక్ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ దినపత్రిక 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) ప్రచురించిన నివేదిక ప్రకారం.. పశ్చిమ ఇరాక్ ఎడారి ప్రాంతంలో నివసించే ఒక స్థానిక గొర్రెల కాపరి కారణంగా ఈ గుట్టు రట్టయింది. ఒకరోజు ఆ గొర్రెల కాపరి ఎడారి ప్రాంతంలో చాలా తక్కువ ఎత్తులో హెలికాప్టర్లు ప్రయాణించడాన్ని గమనించాడు.అవి ఇరాక్ దేశానికి చెందిన హెలికాప్టర్లు కావని గ్రహించిన అతను, కుతూహలంతో ఆ హెలికాప్టర్లు వెళ్లిన దిశగా ముందుకు సాగాడు.
అలా పశ్చిమ ఎడారిలో చాలా దూరం ప్రయాణించిన తర్వాత, అతను ఒక మారుమూల ప్రాంతానికి చేరుకున్నాడు. కానీ, తాను ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ అత్యంత రహస్యంగా నిర్మించుకున్న భారీ సైనిక స్థావరానికి చేరుకున్నాననే విషయం ఆ గొర్రెల కాపరికి అప్పటికి తెలియదు.

ఇరాన్ సరిహద్దుకు కేవలం 1,000 మైళ్ల దూరంలో..
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులను మరింత బలోపేతం చేయడానికి, యుద్ధం ప్రారంభానికి కొద్ది కాలం ముందే ఈ రహస్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అమెరికా అధికారుల సమాచారం ప్రకారం వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ రహస్య స్థావరం గురించి అమెరికాకు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ, ఇరాక్ ప్రభుత్వానికి మాత్రం దీనిపై ఎలాంటి అవగాహన లేదు.

  ఇరాన్‌పై దాడులు చేసే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విమానాలకు అవసరమైన ఇంధన, ఇతర రక్షణ సహాయాన్ని అందించడం కోసం ఇదిలాజిస్టిక్స్ హబ్ గా పనిచేస్తుంది. ఇజ్రాయెల్ ప్రత్యేక రక్షణ దళాలు ఇక్కడ మోహరించాయి.
 ఇరాన్ సరిహద్దుకు కేవలం 1,000 మైళ్ల (దాదాపు 1600 కి.మీ) దూరంలో ఉండడం వల్ల, ఇరాన్ భూభాగంలో దాడుల సమయంలో ఇజ్రాయెల్ పైలట్లు ఎవరైనా శత్రువులకు చిక్కినా లేదా వారి విమానాలు కూలిపోయినా వెంటనే వారిని రక్షించేందుకు ఈ ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉండేవి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కంటే ఈ స్థావరం చాలా దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడి నుండి ఆపరేషన్లు నిర్వహించడం సులువయింది.

గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇరాక్ ఆర్మీ ఒక చిన్న దళాన్ని ఆ ఎడారి ప్రాంతంలో విచారణ కోసం పంపింది. వారు ఈ స్థావరానికి చేరువవుతుండగా, తమ రహస్యం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాక్ సైనికులపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాక్‌కు చెందిన ఒక సైనికుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.ఈ ఘటనతో అప్రమత్తమైన ఇరాక్ ప్రభుత్వం మరికొన్ని అదనపు సైనిక విభాగాలను (కౌంటర్ టెర్రరిజం గ్రూప్స్) అక్కడకు పంపింది. అయితే వారు అక్కడికి చేరుకునే సమయానికే ఇజ్రాయెల్ బలగాలు ఆ స్థావరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. కానీ, అక్కడ అత్యాధునిక సాంకేతిక రక్షణ దళాలు ఇటీవలే పనిచేసినట్లు ఆధారాలను ఇరాక్ ఆర్మీ సేకరించింది.

ఈ దాడి తీవ్ర కలకలం రేపడంతో ఇరాక్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి (UN) లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి దాడి చేసినందుకు అమెరికానే ప్రధాన బాధ్యుడిగా ఇరాక్ పేర్కొంది. అయితే, ఈ దాడిలో అమెరికాకు ఎటువంటి సంబంధం లేదని, అది పూర్తిగా ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ అని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.ఈ పరిణామం ప్రస్తుతం ఇరాక్, ఇజ్రాయెల్,  అమెరికా దేశాల మధ్య తీవ్ర దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు.. శత్రువుల కళ్లు గప్పి ఇరాక్ భూభాగంలోనే ఇజ్రాయెల్ నడిపిన ఈ రహస్య యుద్ధతంత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది.

Advertisment
తాజా కథనాలు