/rtv/media/media_files/2026/04/09/hezbollah-leader-yousuf-ali-killed-2026-04-09-16-09-56.jpg)
Hezbollah Leader Yousuf Ali Killed
Hezbollah Leader : ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ల దేశాల మధ్య రెండు వారాల సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరాన్ మిత్ర దేశమైన లెబనాన్‌కు ఇజ్రాయెల్‌కు మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీంతో ఇజ్రాయెల్ లెబనాన్ పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే వందలాది మిస్సైల్స్‌తో లెబనాన్‌పై దాడులకు దిగిన ఇజ్రాయెల్ తాజాగా సంచలన ప్రకటన చేసింది. లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ అయిన హెజ్‌బొల్లాకు చెందిన మరో కీలక నేతను మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) గురువారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. హెజ్‌బొల్లా చీఫ్ నజీమ్ ఖాసిమ్‌కు దగ్గరి బంధువు, వ్యక్తిగత సలహాదారుడు కూడా అయిన అలీ యూసుఫ్ హార్షీ తమ దాడుల్లో కన్నుమూసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. బుధవారం తాము బీరుట్ నగరంలో జరిపిన దాడుల్లో యూసుఫ్ అలీ హతం అయినట్లు పేర్కొంది.
צה"ל חיסל בביירות את מזכירו של מזכ"ל ארגון הטרור חיזבאללה נעים קאסם: שורת תשתיות טרור הותקפו הלילה בדרום לבנון
— צבא ההגנה לישראל (@idfonline) April 9, 2026
צה"ל תקף וחיסל אתמול את עלי יוסף חרשי, מזכירו האישי של מזכ"ל ארגון הטרור חיזבאללה, ואחיינו של נעים קאסם במרחב ביירות.
חראשי היה מקורב ויועץ אישי למזכ"ל חיזבאללה נעים…
కాగా, ఇరాన్‌కు మద్దుతుగా హెజ్‌బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడులు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే లెబనాన్ ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ అక్కడి మిలిటెంట్ స్థావరాలపై దాడులు చేస్తోంది. అందులో భాగంగా ఆయుధాలు, దళాలను తరలించేందుకు హెజ్‌బొల్లా ఉపయోగించే రెండు రహదారులపై దాడులు చేశామని ఐడీఎఫ్ వెల్లడించింది. వీటితో పాటు దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా ఉపయోగించే 10 ఆయుధాల నిల్వ కేంద్రాలు, లాంచర్లు, కార్యాలయాలపై దాడులు చేశామని పేర్కొంది. అందులో భాగంగానే హెజ్‌బొల్లా చీఫ్ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న అలీ యూసుఫ్ హార్షీని ఖతం చేశామని తెలిపింది. హెజ్ బొల్లా చీఫ్‌తో యూసుఫ్ ఖార్షీ కీలకంగా వ్యవహరించేరని పేర్కొంది.
మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. దీంతో అమెరికా-ఇరాన్‌ల కాల్పుల విరమణ ఒప్పందం మధ్యలోనే వీడిపోవచ్చనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 182 మంది మరణించగా 800 మందికి పైగా గాయపడ్డారని మీడియా కథనాలు వెలువడ్డాయి. బీరుట్‌లో తిష్టవేసిన హెజ్‌బొల్లా నేతలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ కేవలం 10 నిమిషాల్లోనే 100 మిసైల్స్‌ను ప్రయోగించడం సంచలనంగా మారింది. బీరూట్‌తో పాటు దక్షిణ లెబనాన్, బేకా వ్యాలీలో ఒకేసారి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పౌరుల నివాసాలు, సామాన్యులను అడ్డుపెట్టుకుని హెజ్‌బొల్లా తమపై దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. దీనివల్లే సామన్యులు మరణిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతుంది.
Follow Us