ఇజ్రాయెల్ కొత్త స్కెచ్.. ఇదే జరిగితే యుద్ధం తప్పదా? ఇటీవల ఇరాన్‌పై దాడులు చేసిన ఇజ్రాయెల్ కొత్త స్కెచ్‌తో మరోసారి భీకర దాడులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఇంటిపై దాడి వెనుక ఇరాన్ హస్తముందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి దాడులకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. By Kusuma 29 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి కొత్త స్కెచ్‌తో ఇజ్రాయెల్ మళ్లీ ఇరాన్‌పై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇరాన్‌పై దాడులు చేసి ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నిన్న ఇజ్రాయెల్ జరిగిన కేబినెట్‌లో ఈ కీలక విషయాలపై చర్చించినట్లు సమాచారం. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపైన రెండు వారాల కిందట అటాక్ జరిగిన సంగతి తెలిసిందే. ఇది కూడా చూడండి: ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ ఈ దాడి వెనుక ఇరాన్ స్కెచ్ ఉందా? ఈ దాడి సమయంలో నెతన్యాహు ఇంట్లో లేరు. కానీ ఇళ్లు మాత్రం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అయితే ఈ దాడి వెనుక ఇరాన్ స్కెచ్ ఉందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఈ కారణంగా మరోసారి ఇరాన్‌పై భీకర దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. మళ్లీ ఇజ్రాయెల్ దాడులు మొదలు పెడితే ఈ సారి యుద్ధం తప్పదని ఇరాన్ భావిస్తోంది. ఇది కూడా చూడండి: వీధిన పడ్డ ఉద్యోగులు.. రెచ్చిపోయిన సోమిరెడ్డి..! ఎందుకంటే వారిని తక్కువ అంచనా వేశారని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇప్పటికే హెచ్చరించారు. దీంతో ఇరాన్ ఎప్పుడు దాడులు చేస్తే యుద్ధం చేద్దామని ఎదురుచూస్తోంది. ఈసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే ఇజ్రాయెల్ అణుస్థావరాలపై దాడి చేయడానికి ఇరాన్ భారీ స్కెచ్ వేస్తోంది. ఇదే కానీ జరిగితే రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదు. ఇస్లామిక్ దేశాలు ఇప్పటికే ఇరాన్‌కు మద్దతు ప్రకటిస్తున్నాయి. వచ్చే నెల 5వ తేదీన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో అమెరికా కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ ఇదిలా ఉండగా.. ఇటీవల ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఇరాన్‌కు భారీ నష్టం సంభవించింది. అయితే ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీంనేత అయాతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత రెండు రోజులకే ఖమేనీ అకౌంట్‌ను ఎక్స్ సస్పెండ్ చేసింది. ఇది కూడా చూడండి: ఆలయంలో పేలిన బాణాసంచా.. 150 మందికి పైగా గాయాలు #iran-vs-israel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి