ఇరాన్‌పై ప్రతీకార దాడులు.. విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకి పెరుగుతుంది. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌పై విరుచుకుపడింది. దాదాపు 100 యుద్ధ విమానాలు, డ్రోన్లు, జోర్డాన్, సిరియా, ఇరాక్ మీదుగా శనివారం తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించాయి. By Kusuma 27 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకి పెరుగుతుంది. అక్టోబర్ 1న తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దాదాపు 100 యుద్ధ విమానాలు, డ్రోన్లు, జోర్డాన్, సిరియా, ఇరాక్ మీదుగా శనివారం తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించాయి. రాజధానితో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో దాడులు చేశాయి. ఇది కూడా చూడండి: ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని.. తక్కువ నష్టమే జరిగిందని.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ రెండు దశల్లో దాడులు జరిపింది. మొదట ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఆ తర్వాత క్షిపణి వ్యవస్థలున్న ప్రదేశాలపై దాడి చేసింది. అయితే ఈ దాడిలో ఇరాన్ క్షిపణి, డ్రోన్ వ్యవస్థలకు ఇజ్రాయెల్ భారీ నష్టం కలిగించినట్లు తెలిపింది. కానీ తక్కువ నష్టమే జరిగిందని ఇరాన్ తెలిపింది. ఇది కూడా చూడండి: డిసెంబరు నాటికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ ఇజ్రాయెల్ క్షిపణుల దాడుల్ని ఇరాన్ రక్షణ వ్యవస్థలు తిప్పికొట్టాయని తెలిపింది. ఈ దాడుల్లో నలుగురు ఇరాన్ సైనికులు మృతి చెందినట్లు ఆ దేశం వెల్లడించింది. అయితే ఈ యుద్ధాలు ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. అయితే ఈ దాడులపై ఇరాన్ స్పందించింది. ఈ దాడిపై ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సిందేనని తెలిపింది. ఇది కూడా చూడండి: BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 7ఏళ్ల జైలు శిక్ష! ఇదిలా ఉంటే 1980ల్లో ఇరాక్‌తో జరిగిన యుద్ధం తర్వాత.. ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపించడం కూడా ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరాన్‌లోని ఓ వైమానిక స్థావరం సమీపంలోని రాడార్ వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఆ దాడులు తామే చేసినట్లు కూడా అధికారికంగా పేర్కొనలేదు. ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ స్పందించకూడదని, ఉద్రిక్తత వాతావరణానికి ఇక ఆపేయాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ దాడులు ఇకనైనా ఆపితే ఇరు దేశాలకు మంచిదని భావిస్తున్నారు. ఇది కూడా చూడండి: తెలంగాణలో రేపటి నుంచి బీసీ కమిషన్ పర్యటనలు #iran-isreal-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి