/rtv/media/media_files/2026/03/24/iran-2026-03-24-21-50-43.jpg)
America is ready for fierce attacks
IRAN ATTACK : అమెరికాకు ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది.అమెరికా టెక్సాస్‌లో పోర్ట్ ఆర్థర్ ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది.భారీగా మంటలు చెలరేగడంతో పాటు, దట్టమైన పొగ కమ్ముకున్నాయి. అయితే మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా భావించిన అమెరికా సైబర్ అటాక్ ద్వారా ఆయిల్ రిఫైనరీలో పేలుడు జరిగేలా ఇరాన్ కుట్ర చేసినట్లు అమెరికా అనుమానిస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌పై సైబర్ దాడులు... చేస్తామని కొద్దిరోజులుగా ఇరాన్ వార్నింగ్ ఇస్తున్న క్రమంలో ఇరాన్‌కు సపోర్ట్‌గా హండాలా, మడ్డీవాటర్ హ్యాకింగ్ గ్రూప్స్ రంగంలోకి దిగాయి.సైబర్ అటాక్ ద్వారా పేలుళ్లు సాధ్యమేనంటున్నారు నిపుణులు.
ఇరాన్ ఎనర్జీ ఫెసిలిటీస్‌ను పేల్చేస్తామని ట్రంప్ హెచ్చరించిన... 48 గంటల్లోనే అమెరికాలోని కీలక రిఫైనరీలో పేలుడు సంభవించడం చర్చకు దారి తీసింది.--- ఇది ఇరాన్ పనే అని అంతర్జాతీయ మీడియా సంస్థలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ ఘటనపై కీలక విషయాలను తెలుసుకునేందుకు FBI, అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి.సైబర్ సాబోటెజ్ ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. ఇది ఇరాన్ చేసిన సైబర్ దాడి అని తేలితే...అమెరికా నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఉండే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
B-52 BOMBERS : ఇరాన్ పై దాడులకు సిద్ధం
కాగా ఐదు రోజులపాటు యుద్ధానికి విరామం ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ యుద్ధం ఆగలేదు. ఒకవైపు, ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటంతో -ఇరాన్‌పై భీకర దాడులకు అమెరికా సిద్ధమైంది. బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఫెయిర్‌ఫోర్డ్ బేస్ నుంచి... ఇరాన్‌పై B-52 బాంబర్లతో దాడికి అమెరికా ప్లాన్ చేస్తుంది. అమెరికా ప్లాన్‌ను ఫాక్స్ న్యూస్ ధృవీకరించారు.2 వేల పౌండ్ల బరువున్న పెనెట్రేటర్ బాంబులను B-52 బాంబర్లు మోసుకెళ్తున్న ట్లు నిర్ధారించారు.ఇరాన్ అణు కేంద్రాలు, మిస్సైల్ సిటీస్‌ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా అమెరికా ముందుకు సాగుతుంది.వందల అడుగులో లోతులో ఉన్న అణు కేంద్రాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఈ బాంబర్లకు ఉంది. టార్గెట్ 8 నుంచి 24 కిలోమీటర్ల దూరం ఉండగానే బాంబులను వదిలి..బాంబర్ విమానం సేఫ్‌గా రిటర్న్ అయ్యే టెక్నాలజీ దీనిసొంతం.
ఇప్పటికే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్‌ను అమెరికా ధ్వంసం చేసింది. ఇప్పుడు భారీ బాంబర్లను అమెరికా రంగంలోకి దించుతుంది.తన బేస్‌ను వాడుకునేందుకు అమెరికాకు బ్రిటన్ పర్మిషన్ ఇవ్వడంతో 70 వేల పౌండ్ల మందుగుండు మోసుకెళ్లే కెపాసిటీ B-52 బాంబర్ ప్రత్యేకత.రష్యా ఇరాన్‌కు సరఫరా చేసిన S-400 ఈ దాడులను అడ్డుకుంటాయా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను పూర్తిగా ధ్వంసం చేసి...ఆ దేశాన్ని డిజిటల్ చీకట్లోకి నెట్టేలా అమెరికా ప్లాన్ చేసింది. అమెరికా B-52 బాంబర్లతో దాడి చేస్తే గల్ఫ్ దేశాలపై దాడిని.మరింత పెంచుతామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు అమెరికా యుద్ధనౌకలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మోహరించాయి. B-52 బాంబర్లతో దాడి జరిగితే...మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందని నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow Us