America-Iran: యుద్ధం ఎఫెక్ట్.. ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ.. పునర్నిర్మాణానికి రూ.25 లక్షల కోట్లు!

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య 107 రోజుల పాటు సాగిన భయంకర యుద్ధం ఎట్టకేలకు శాంతి ఒప్పందంతో ముగిసింది. అయితే ఇరాన్ మళ్లీ కోలుకుని.. తనను తాను తిరిగి నిర్మించుకోవడానికి కనీసం 300 బిలియన్ డాలర్లు (సుమారు 25.05 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చవుతుందని తెలుస్తోంది.

New Update
trump

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య 107 రోజుల పాటు సాగిన భయంకర యుద్ధం ఎట్టకేలకు శాంతి ఒప్పందంతో ముగిసింది. యుద్ధ జ్వాలలు చల్లారినప్పటికీ, అమెరికా జరిపిన భారీ వైమానిక దాడుల వల్ల ఇరాన్ దేశం పూర్తిగా ధ్వంసమైంది. దీని నుంచి ఇరాన్ మళ్లీ కోలుకుని.. తనను తాను తిరిగి నిర్మించుకోవడానికి కనీసం 300 బిలియన్ డాలర్లు (సుమారు 25.05 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చవుతుందని తెలుస్తోంది. అయితే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 

ఇది కూడా చూడండి: Strait of Hormuz: హర్మూజ్‌లో నో టోల్ ఫీజ్.. కానీ సర్వీస్ ఛార్జీలు కట్టాల్సిందే.. అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్

ఈ యుద్ధం వల్ల ఇరాన్ ఎంతగా నష్టపోయిందో ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి ఫాతేమా మొహాజెరాని తెలిపారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి చమురు, గ్యాస్ రిఫైనరీలు అమెరికా బాంబు దాడుల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన వంతెనలు, సముద్ర ఓడరేవులు, రైల్వే నెట్‌వర్క్, కరెంట్, తాగునీటి ప్లాంట్లు పూర్తిగా నాశనమయ్యాయి. వీటితో పాటు సాధారణ ప్రజలుండే వేలాది ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు కూడా నేలమట్టమయ్యాయి. ఇరాన్ అంచనా ప్రకారం యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తమకు రూ. 22.5 లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. అమెరికా దాడుల్లో ఇరాన్‌లోని దాదాపు 17 వేలకు పైగా కీలక స్థావరాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ మళ్లీ పూర్వపు స్థితికి రావడానికి, కొత్తగా బిల్డింగులు నిర్మించడానికి కనీసం 10 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ యుద్ధం వల్ల అమెరికాకు కూడా సుమారు 29 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2.4 లక్షల కోట్లు) ఖర్చయిందని పెంటాగన్ తెలిపింది. 

ఇది కూడా చూడండి:  BIG BREAKING: కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్.. టెలిగ్రాం బ్యాన్

అమెరికా భరిస్తుందా?

ఇరాన్‌కు అమెరికా సొంత డబ్బు ఇస్తోందనేది కేవలం ఫేక్ న్యూస్ అని ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికా ప్రజలు కట్టే పన్నుల డబ్బును ఇరాన్ కోసం వాడటానికి అక్కడి పార్లమెంట్ (కాంగ్రెస్) కూడా ఒప్పుకోదు. ఈ డబ్బును అంతర్జాతీయ పెట్టుబడి నిధి నుంచి ఇస్తున్నారు. ఈ నిధిలోకి గల్ఫ్ దేశాలు అయిన సౌదీ అరేబియా, యూఏఈ వంటి ధనిక అరబ్ దేశాలు, ఇతర ప్రపంచ దేశాలు పెట్టుబడులు లేదా ఆర్థిక సాయం అందిస్తాయి. ఇరాన్ తన అణ్వాయుధాలను పూర్తిగా వదులుకుని, అంతర్జాతీయ నియమాలను పాటిస్తేనే ఈ నిధులు అందుతాయి. అమెరికా కేవలం ఈ ఒప్పందానికి గ్యారెంటర్ గా ఉండి ఆ నిధిని పర్యవేక్షిస్తుంది తప్ప.. తన జేబులోంచి ఈ భారీ మొత్తాన్ని చెల్లించదు. 

ఇది కూడా చూడండి: NEET: నీట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అభ్యర్థుల అకౌంట్లు హ్యాక్

నిజానికి ఈ యుద్ధ విధ్వంసం నుంచి ఇరాన్ పూర్తిగా కోలుకోవడానికి ఈ డబ్బు సరిపోదు, భవిష్యత్తులో ఇంకా ఎక్కువే అవసరమవుతుంది. సమయం పెరిగే కొద్దీ ఖర్చు పెరుగుతుంది. ఇరాన్ పునర్నిర్మాణం పూర్తి కావడానికి కనీసం 10 నుండి 15 ఏళ్లు పడుతుందని అంచనా. ఇన్నేళ్ల కాలంలో ద్రవ్యోల్బణం వల్ల సిమెంట్, స్టీల్, లేబర్, మిలిటరీయేతర సాంకేతికత ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల బడ్జెట్ అంచనాలు దాటిపోతాయి. అలాగే బాంబు దాడుల్లో పైకి కనిపించే బిల్డింగులు, వంతెనలే కాకుండా.. భూగర్భంలో ఉండే వాటర్ పైప్‌లైన్లు, గ్యాస్ లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిని గుర్తించి రీపేర్ చేయడానికి అనుకున్నదానికంటే భారీగా ఖర్చవుతుంది. ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరు చమురు (ఆయిల్) ఎగుమతులు. ఆ రిఫైనరీలన్నీ కాలి బూడిదయ్యాయి. అంటే ఇరాన్ సొంతంగా రూపాయి కూడా సంపాదించలేని స్థితిలో ఉంది. దేశ ప్రజలకు ఉపాధి కల్పించాలన్నా, ప్రభుత్వ యంత్రాంగం నడవాలన్నా ఈ రూ.25 లక్షల కోట్లు కాకుండా అదనపు గ్రాంట్లు అవసరమవుతాయి.

ఇది కూడా చూడండి: Today Horoscope: నేడు ఈ రాశుల వారు జాగ్రత్త.. లేకపోతే ప్రాణాలకు ముప్పు తప్పదు

Advertisment
తాజా కథనాలు