US-Israel-Iran War : ఇరాన్  అమెరికా చర్చలు విఫలం...తర్వాత ఏం జరగబోతోంది..?

ఇరాన్  అమెరికా చర్చలు విఫలమయ్యాయి...అయితే, తర్వాత ఏం జరగబోతోంది..? ఇప్పుడంతా ఇదే టెన్షన్...పూర్తిస్థాయి యుద్ధమా...?అమెరికా - ఇరాన్  చర్చలు ఫెయిల్ అవ్వడంతో world wide ఉత్కంఠ నెలకొంది..ఈ అనిశ్చితిపై న్యూయార్క్ టైమ్స్..ఒక కథనాన్ని ప్రచురించింది..

New Update
FotoJet (52)

JD Vance

US-Israel-Iran War : ఇరాన్  అమెరికా చర్చలు విఫలమయ్యాయి...అయితే, తర్వాత ఏం జరగబోతోంది..? ఇప్పుడంతా ఇదే టెన్షన్...పూర్తిస్థాయి యుద్ధమా...?అమెరికా - ఇరాన్  చర్చలు ఫెయిల్ అవ్వడంతో world wide ఉత్కంఠ నెలకొంది..ఈ అనిశ్చితిపై న్యూయార్క్ టైమ్స్..ఒక కథనాన్ని ప్రచురించింది..అదేంటో చూద్దాం...
 
చర్చలు ఎందుకు విఫలమయ్యాయి?...దాదాపు 25గంటలపాటు...ఇరాన్‌తో జేడీవాన్స్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు...మీరు అణు సామర్థ్యాన్ని పూర్తిగా వదులుకోండి...ఇది మా అధ్యక్షుడు ట్రంప్‌ Final Warning...
డిస్కషన్ టేబుల్‌పై ఇరాన్‌కు జేడీవాన్స్‌ స్పష్టంచేశారు..అయితే అమెరికా తాటాకు చప్పుళ్లకు ఇరాన్ బెదరలేదు...మా అణు కార్యక్రమాలు జరుగుతాయని తెగేసి చెప్పింది..మా ప్రాణాలు పోయినా సరే...మీకు లొంగే ప్రసక్తే లేదు...
జేడీవాన్స్‌కు ఇరాన్ ప్రతినిధులు ఖరాకండీగా చెప్పేశారు..ఇరాన్‌ లెక్కలేనితనం...ఇప్పుడు ట్రంప్‌ను అయోమయంలో పడేలా చేసింది...38రోజుల యుద్ధంతో ఇరాన్ ఆయుధ సంపత్తి దెబ్బతిన్న మాట వాస్తవమే...కానీ, ఇరాన్ ఎక్కడా లొంగకుండా అమెరికాకు షాకివ్వడం సర్వత్రా చర్చకు తెరలేపింది.
 
ఇక ట్రంప్ ముందు రెండు దారులే మిగిలి ఉన్నాయి..ఇరాన్‌తో మళ్ళీ  చర్చలు జరపడం....లేదా తిరిగి యుద్ధం ప్రారంభించడం...యుద్ధం మళ్ళీ మొదలవుతుందా..?మళ్లీ war start అయితే ఏం జరగబోతుంది..?ప్రస్తుత టెంపరీ సీజ్‌ ఫైర్‌ ఈ 21తో ముగుస్తుంది...ఇక అక్కడినుంచి మళ్లీ దాడులు, ప్రతిదాడులు జరిగితే..చమురు సంక్షోభానికి దారితీస్తుంది..ప్రపంచవ్యాప్తంగా 20% ఆయిల్ సరఫరా నిలిచిపోతుంది...ఇప్పటికే 3.3% ఉన్న ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది..ఫలితంగా పెట్రో ధరలు ఆకాశాన్ని తాకుతాయి...ఎరువుల తయారీకి కావాల్సిన హీలియం...technical gadgetsకు ఉపయోగించే...సిలికాన్‌, జర్మేనియం ముడిపదార్థాల కొరతతో...ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యవ్యవస్థ స్తంభించిపోతుంది..ఫలితంగా ఆయాదేశాల్లో నిల్వఉన్న వస్తువుల రేట్లకు మరింత రెక్కలు వస్తాయి...
 
ఇరాన్ ఆయువుపట్టు హార్ముజ్ జలసంధే...ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గాన్ని ...తన అదుపులో ఉంచుకోవాలని ఆ దేశం చూస్తోంది. అలాగే, అమెరికా వదిలిన ప్రతి బుల్లెట్‌కు...నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్‌ డిమాండ్ చేస్తోంది..అయితే, దీనికి అమెరికా నో అంటోంది..
 
ప్రస్తుతానికి రెండు దేశాలూ తామే గెలిచామని భావిస్తున్నాయి...దాడులతో ఇరాన్‌ను కోలుకోనీయకుండా చేశామని అమెరికా జబ్బలు చరుచుకుంటుంటే...అమెరికా దాడులను తట్టుకొని నిలబడ్డామని ఇరాన్‌ ధీమాగా ఉంది..
మొత్తానికి ఈ ఇద్దరి మొండితనం వల్ల...ప్రపంచం third world war అంచున నిలబడి ఉంది...

Advertisment
తాజా కథనాలు