/rtv/media/media_files/2026/04/08/isereal-2026-04-08-19-49-39.jpg)
లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 100 హిజ్బుల్లా స్థావరాలపై ఏకంగా 160 బాంబులను కురిపించి బీభత్సం సృష్టించాయి. ఈ మెరుపు దాడులతో లెబనాన్ రాజధాని బీరుట్‌తో పాటు దక్షిణ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఎటర్నల్ డార్క్‌నెస్ అనే కోడ్ నేమ్‌తో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో హిజ్బుల్లాకు చెందిన కమాండ్ సెంటర్లు, నిఘా కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది.
ఈ భీకర దాడులను లెబనాన్ అధ్యక్ష కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ చేస్తున్నవి ఆటవిక దాడులని, అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను ఇజ్రాయెల్ ఏమాత్రం గౌరవించడం లేదని మండిపడింది. గత 15 నెలలుగా జరుగుతున్న ఉల్లంఘనలు చూస్తుంటే, ఇజ్రాయెల్‌ను అడ్డుకునే వారు ఎవరూ లేరన్నట్లుగా వ్యవహరిస్తోందని లెబనాన్ ఆవేదన వ్యక్తం చేసింది.
కొత్త ఊచకోతకు తెరలేపింది
ఇజ్రాయెల్ ఒక కొత్త ఊచకోతకు తెరలేపిందని, ఈ దాడుల వల్ల ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని లెబనాన్ హెచ్చరించింది. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ఇజ్రాయెలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అరాచకాన్ని వెంటనే ఆపడానికి అంతర్జాతీయ సమాజం కల్పించుకోవాలని లెబనాన్ విజ్ఞప్తి చేసింది.
Follow Us