Iran's warning to Israel : దాడులు ఆపకపోతే మళ్లీ యుద్ధం... ఇజ్రాయెల్‌కు ఇరాన్ బిగ్ వార్నింగ్

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య రెండు వారాల యుద్ధ విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ  లెబనాన్‌లో మాత్రం ఇజ్రాయెల్‌  కాల్పులు కొనసాగిస్తోంది. దీంతో  ఇజ్రాయెల్‌కు ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది.దాడులు ఆపకపోతే మళ్లీ యుద్ధం మొదలుపెడుతామని హెచ్చరిక జారీ చేసింది.

New Update
Iran Israel Conflict

Iran's warning to Israel

Iran's warning to Israel : ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ బిగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య రెండు వారాల యుద్ధ విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ  లెబనాన్‌లో మాత్రం ఇజ్రాయెల్‌  కాల్పులు కొనసాగిస్తోంది. దీంతో  ఇజ్రాయెల్‌కు ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది.దాడులు ఆపకపోతే మళ్లీ యుద్ధం మొదలుపెడుతామని హెచ్చరిక జారీ చేసింది.ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం కురిపిస్తామని ఇరాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. రాబోయే కొద్ది గంటల్లో లెబనాన్‌లో దాడులు ఆపాలని డిమాండ్ చేసింది. లేదంటే నేరుగా టెల్ అవీవ్‌ను పేల్చేస్తామంటున్న ఇరాన్ హెచ్చరించింది.

ఇదిలా ఉండగా-- అమెరికా ఇజ్రాయెల్ మధ్య 2 వారాల సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. సీజ్‌ఫైర్‌లో లెబనాన్‌ను కూడా భాగం చేస్తూ ట్రంప్ ప్రకటన చేశారు. కానీ,  నెతన్యాహు  మాత్రం ట్రంప్‌ సీజ్‌ఫైర్‌ను పట్టించుకోవడం లేదు. లెబనాన్‌లోని హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఇరాన్‌  ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే..హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచుతామని ఇరాన్ తేల్చి చెప్పింది. సీజ్‌ఫైర్‌ ప్రకటన జరిగినా ఉద్రిక్తతలు  ఆగకపోవడంతో -- ఏక్షణం, ఎటునుంచి బాంబు పడుతుందోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది.

మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రపంచానికి షాక్ ఇచ్చారు.  ఖమేనీ కోమా లోకి వెళ్లారని వార్తలు వస్తుండగా తాజాగా ఆయన సంచలన ప్రకటన చేశారు."యుద్ధం ఇంకా ముగియలేదు. మా వేళ్లు ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. అమెరికా, ఇజ్రాయెల్ తేడా చేస్తే, ఏ చిన్న తప్పు చేసినా గట్టిగా బుద్ధి చెంబుతాం" అని మొజ్తబా వార్నింగ్ ఇచ్చారు.  దీంతో ఖమేనీ బతికే ఉన్నారని తెలుస్తోంది.
  
ట్రంప్  సైలెంటుగా కాల్పుల విరమణకు ఒప్పు్కొన్నప్పటికీ. ఇరాన్ మాత్రం.. తేడా వస్తే వారే అంటూ హెచ్చరించడం ద్వారా.. తాము వెనక్కి తగ్గట్లేదనే సంకేతాలు ఇచ్చింది. కానీ ట్రంప్.. కొన్ని రోజులుగా.. చాలాసార్లు డెడ్ లైన్లు పెట్టి.. యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. తాజాగా 48 గంటల డెడ్‌లైన్ ముగిసే సమయంలో ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తాం అని కూడా బెదిరించారు. అయినా ఇరాన్ "దేనికైనా రెడీ" అంది. చివరకు ట్రంప్ శాంతి చర్చలకు సిద్ధమయ్యారు. ఇలా ట్రంప్ తమ దారికి వచ్చేలా చేసుకోవడంలో ఇరాన్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు