/rtv/media/media_files/2026/03/22/open-strait-of-hormuz-within-48-hours-trump-warns-iran-2026-03-22-08-05-29.jpg)
High tension near the Strait of Hormuz.
Hormuz Strait : ఇరాన్, అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచ దృష్టి అంతా హార్మూజ్ జలసంధిపైనే పడింది. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయలాంటి ఈ జలసంధిని మూసివేయడం ద్వారా అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్టవేయాలని ఇరాన్ భావిస్తుంది. ఆ దేశ నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణించకుండా అడ్డుకోవడంతో ఆ దేశ వాణిజ్యానికే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికి కూడా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి ఇంధన రవాణా నిలిచిపోవడంతో అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు హార్మూజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తామని అమెరికా హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ రోజు--- రాత్రి 7 గంటల 30 నిమిషాలకు బ్లాకేడ్ ప్రారంభం కానుంది.--- ఇరాన్ ఓడరేవులకు వెళ్లే, వచ్చే అన్ని రకాల నౌకలను అడ్డుకోవాలని అమెరికన్ నేవీకి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌కు ఎవరైనా టోల్ (Toll) చెల్లిస్తే.. ఆ నౌకలను అంతర్జాతీయ జలాల్లో అడ్డుకుంటామని ట్రంప్ హెచ్చరించాడు.
ఇరాన్ ఓడ రేవుల దిగ్భంధనం
హెచ్చరించినట్లుగానే ఇప్పటికే అమెరికా వార్ షిప్‌లను రంగంలోకి దించింది.ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. హర్మూజ్ జలసంధిని తెరవకపోవడంతో అమెరికా ప్రతిచర్యకు దిగింది. అక్కడ భారీగా బలగాలను మోహరించిన అమెరికా నౌకాదళం ఏ దేశమైనా తమ అనుమతి తీసుకోవాల్సిందేనని హెచ్చరించింది. అయితే ఓడరేవుల దిగ్బంధంపై అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. తమ పోర్టులను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చింది.తమ పోర్టులకు ముప్పు కలిగితే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది.
ట్రంప్ చర్యతో మరోసారి క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగింది. గల్ఫ్ దేశాలకు వచ్చే ఆహార దిగుమతుల్లో 80% ఈ మార్గం ద్వారానే రవాణా అవుతాయి.-బ్లాకేడ్ కొనసాగితే అక్కడ ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది.ఇండియా దిగుమతి చేసుకునే చమురులో ఎక్కువ భాగం హార్మూజ్ నుంచే చేసుకుంటుంది. బ్లాకేడ్ కొనసాగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కాగా అమెరికా బ్లాకేడ్ నిర్ణయానికి మద్దతివ్వడం లేదని బ్రిటన్ ప్రకటించింది. కాగా అమెరికా హెచ్చరికాతో మరోసారి భీకర యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికాకు ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది.--- యుద్ధ నౌకలు హార్మూజ్‌కు వస్తే..తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.10 లక్షల సైన్యాన్ని రంగంలోకి దించుతామంటూ వార్నింగ్ ఇచ్చింది.
గ్లోబల్ ట్రేడ్ పై చైనా ఆందోళన
మరోవైపు హార్మూజ్‌ను దిగ్భందిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చిరించడంపూ అంతర్జాతీయంగా కలకలం రేగింది. ఈ విషయంలో చైనా తీవ్రంగా స్పందించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలగకుండా అడ్డంకులు లేని మార్గాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చింది. ఇరాన్ ఓడ రేవులకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడాన్ని చైనా వ్యతిరేకించింది. ఈ విషయమై
చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ బీజింగ్‌లో జరిగిన సమావేశంలో స్పందించారు. హోర్మూజ్ జలసంధి కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదన్నారు, ఇది ప్రపంచ వాణిజ్యం , ఇంధన భద్రతకు వెన్నెముక అని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గించి, అన్ని పక్షాలు శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో దాదాపు ఐదింట ఒక వంతు ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ దిగ్బంధనం జరిగితే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని చైనా హెచ్చరించింది.
Follow Us