GROUNDAWAR : ఇరాన్‌ పై గ్రౌండ్‌ వార్‌...దేశం చుట్టూ భారీగా అమెరికా సైన్యం

ఇప్పటివరకు వైమానిక, మిస్సైల్స్‌తో ఇరాన్‌పై విరుచకు పడిన అమెరికా తన యుద్ధ రూపాన్ని మార్చుకోనుంది. ఇక మీదట ఇరాన్‌తో  గ్రౌండ్‌ వార్‌ చేయాలని ఆలోచిస్తుంది. అనుకున్నట్లుగానే అమెరికా గ్రౌండ్‌ వార్‌ కు డేట్ ఫిక్స్ చేసింది.

New Update
_US Army

GROUNDAWAR

GROUNDAWAR : ఇప్పటివరకు వైమానిక, మిస్సైల్స్‌తో ఇరాన్‌పై విరుచకు పడిన అమెరికా తన యుద్ధ రూపాన్ని మార్చుకోనుంది. ఇక మీదట ఇరాన్‌తో  గ్రౌండ్‌ వార్‌ చేయాలని ఆలోచిస్తుంది. అనుకున్నట్లుగానే అమెరికా గ్రౌండ్‌ వార్‌ కు డేట్ ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 6 తర్వాత ఏ క్షణమైనా ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ట్రంప్‌ ఇరాన్ చుట్టూ సైన్యాన్ని మొహరించారు. మిడిల్‌ ఈస్ట్‌లో 50 వేలకుపైగా అమెరికా సైన్యం సిద్ధంగా ఉంది. అదనంగా మరో 5 వేల మంది సైనికులు కూడా మిడిల్‌ఈస్ట్‌కు చేరుకుంటున్నారు.ఇందులో 2500 మంది మెరైన్స్ ఉన్నారని తెలుస్తోంది.

యుద్ధం మొదలైన తర్వాత మరో 10 వేల మందిని పంపే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. 2003 తర్వాత మిడిల్‌ ఈస్ట్‌లో ఇదే అతిపెద్ద సైనిక మొహరింపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. USS ట్రిపోలి 3500 మంది సైనికులతో గల్ఫ్‌కు చేరుకుంది. మరోవైపు2000 మంది పారాట్రూపర్లను ట్రంప్‌ అత్యవసరంగా రంగంలోకి దింపాడు.ఖార్గ్ ఐలాండ్‌ను సీజ్ చేయడమే అమెరికా ఫస్ట్ టార్గెట్ గా వారు ముందుకు సాగుతున్నారు.మరోవైపు 2025లో ఫోర్డో న్యూక్లియ్ ప్లాంట్‌ను పేల్చిన టైంలో...అదృశ్యమైన 400 కేజీల యురేనియం కోసం స్పెషల్ సెర్చ్ ఆఫరేషన్ కూడా కొనసాగుతుంది. అయితే నిపుణులు మాత్రంఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌ అమెరికాకు డేంజర్ అంటున్నారు.ఇరాన్ దగ్గర అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ ఉందంటూ అమెరికాను నిపుణులు హెచ్చరిస్తున్నారు.గ్రౌండ్ ఆపరేషన్ మొదలైతే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంటుందన్న ఆందోళన అందరిలోనూ ఉంది.

Advertisment
తాజా కథనాలు