ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం ఎంతంటే? ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాలపై ఆకలి సూచీలో అధ్యయనం చేయగా భారత్ 105వ స్థానంలో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలు ఈ ఆకలి సూచీలో భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. By Kusuma 12 Oct 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి భారత దేశం రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న ఆకలి కేకలు మాత్రం తగ్గడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి దాదాపుగా ఎనిమిది దశాబ్దాలు అయిన కూడా ఆకలి కేకలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడంలేదు. ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాల్లో 19వ ఆకలి సూచీలను అధ్యయనం చేశారు. ఈ ఏడాది ఆకలి సూచిలో భారత్ 105వ స్థానంలో ఉంది. ఇది కూడా చూడండి: సగటు అప్పుల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్! పొరుగు దేశాల కంటే.. ఐర్లాండ్‌కు చెందిన కంసర్న్ వరల్డ్ వైడ్, జర్మనీకి చెందిన వెల్త్ హంగర్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ ఆకలి సూచీని విడుదల చేశాయి. ఈ సూచిలో ఎక్కువ స్కోర్, ర్యాంకు సాధించిన దేశాలు ఆకలి సంక్షోభంలో తీవ్రంగా ఉన్నాయని అర్థం. ఆర్థిక సంక్షోభం ఉన్న శ్రీలంక, అంతర్గత సంక్షోభాలను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్, మయన్మార్‌తో పాటు నేపాల్ వంటి మన పొరుగు దేశాలు ఈ ఆకలి సూచీలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఇది కూడా చూడండి: పేరుకే ఎంబీఏ.. కానీ దొంగతనంలో పీహెచ్‌డీ ఈ సూచీలో భారత్‌ను 29.3 స్కోర్‌తో ఆందోళనకర విభాగంలో యాడ్ చేశారు. అయితే ఈ ఆకలి సూచిలో ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు మాత్రమే ఆందోళనకర విభాగంలో ఉన్నాయి. అందులో మన భారత్ కూడా ఒకటి ఉంది. గత రెండు దశాబ్దాల నుంచి ఆకలి విషయంలో కొంత మెరుగుదల కనిపిస్తున్నా కూడా భారత్‌లో ఇంకా ఆకలి కేకలు తగ్గడం లేదని ఈ సూచీలు తెలుపుతున్నాయి. ఇది కూడా చూడండి: పడిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ షేర్లు.. కారణమిదేనా? #india #hunger మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి