ఫ్రాన్స్‌ లో అనుకోని పరిణామాలు..అవిశ్వాస తీర్మానంలో ఓడిన  ప్రధాని!

ఫ్రాన్స్‌ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మితవాద, అతివాద చట్టసభ సభ్యులు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఈ ఘటనతో ప్రధాని మిచెల్‌ బార్నియర్‌ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

New Update
france

ఫ్రాన్స్‌ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మితవాద, అతివాద చట్టసభ సభ్యులు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఈ ఘటనతో ప్రధాని మిచెల్‌ బార్నియర్‌ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఫ్రాన్స్‌ చరిత్రలో 1962 తర్వాత అవిశ్వాస తీర్మానంతో పదవి నుంచి వైదొలగనున్న తొలి ప్రధానిగా బార్నియర్‌ చరిత్ర సృష్టించారు.

Also Read:  డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు: సీఎస్

ఆయన ప్రధానిగా కేవలం మూడు నెలలు మాత్రమే ఉన్నారు. అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగానూ మిచెల్‌ నిలిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీ అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే మొదటి సారి. అసెంబ్లీలో 577 ఓట్లు ఉండగా.. ప్రధానికి వ్యతిరేకంగా 331 ఓట్లు పడ్డాయి.

Also Read: BIG BREAKING: ‘పుష్ప2’ ప్రీమియర్‌కు ముందు పోలీసుల లాఠీ ఛార్జ్!

అవిశ్వాస తీర్మానాన్ని తొలుత మితవాద సభ్యులు ప్రవేశపెట్టగా, మారైన్‌  లె పెన్‌ నేతృత్వంలోని ఫార్‌ రైట్‌ నేషనల్‌ ర్యాలీ మద్దతు పలికింది దీంతో ప్రధానికి వ్యతిరేకంగా భారీగా ఓట్లు పడ్డాయి. ఈ ఘటనతోబార్నియర్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు. గత జులైలోనే అధ్యక్షుడు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ నూతన ప్రధానిగా బార్నియర్‌ ను నియమించగా,మూడు నెలలకే ఆయన పదవిచ్యూతుడయ్యారు.

Also Read: ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు.. ఈవెంట్స్‌లో 44 మంది క్వాలిఫై

అంతకుముందు 34 ఏళ్ల గాబ్రియేల్‌ అట్టల్‌ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. గత జులైలో ఆయన ఆ పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఈ ఏడాదిలోనే మూడోసారి ప్రధానిని నియమించడం మెక్రాన్‌కు సవాల్‌ గా మారింది. ఇక అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. 

Also Read: Movies: వైభవంగా చైతూ–శోభిత పెళ్లి..మురిసిపోయిన నాగార్జున

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు