Iran launches drone attacks : హైఫా పోర్ట్‌పై డ్రోన్లతోదాడి.. ఇజ్రాయెల్‌పై విరుచుపడ్డ ఇరాన్‌

అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు ఇరాన్‌ పై విరుచుకుపడుతున్నప్పటికీ ఇరాన్ ఏ మాత్రం జంకడం లేదు. ఇజ్రాయెల్‌ను ముప్పుతిప్పలు పెడుతుంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ మీద మరోసారి దాడి చేసింది. ఇజ్రాయెల్‌ లోని కీలకమైనహైఫా పోర్ట్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌‌తో భీకర దాడి చేసింది.

New Update
FotoJet (17)

Drone attack on Haifa port.. Iran lashes out at Israel

Iran launches drone attacks : అమెరికా, ఇజ్రాయెల్‌ దళాలు ఉమ్మడిగా ఇరాన్‌ పై విరుచుకుపడుతున్నప్పటికీ ఇరాన్ ఏ మాత్రం జంకడం లేదు. ఇజ్రాయెల్‌ను ముప్పుతిప్పలు పెడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ మీద మరోసారి ఇరాన్‌ దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌ లోని కీలకమైనహైఫా పోర్ట్‌పై డ్రోన్లు, మిస్సైల్స్‌‌తో భీకర దాడి చేసింది. నౌకాదళ మరమ్మత్తు కేంద్రాలు, లాజిస్టిక్స్ విభాగాలు, భారీ ఇంధన నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాన్‌ డ్రోన్‌ సామర్ధ్యం తగ్గిందని అమెరికా-ఇజ్రాయెల్ చేసిన వాదనలకు సమాధానంగాఈ దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించడం గమనార్హం
 
ఒకవైపు ఇరాన్‌ దాడులు చేస్తు్న్న క్రమంలోనే మరోవైపు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా దాడులు చేశాయి. గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 82వ విడత ప్రతీకార దాడులను మొదలు పెట్టింది.  IRGC కూడా హైఫా పోర్ట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో పాటు డెడ్ సీ (Dead Sea) సమీపంలోని ఇజ్రాయెల్ అణు కార్యక్రమాలకు చెందిన పరిశ్రమలు, సైనిక కమాండ్ సెంటర్లపై దాడులు చేసినట్లు IRGC వెల్లడించింది.

ఇదిలా ఉండగా ఈసారి ఇరాన్‌ దాడులకు వివిధ రకాల క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగించింది. అదే సమయంలో ఇరాన్ భూభాగంపై అమెరికా భూతల దాడికి  ప్రయత్నం చేస్తే అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు నరకం చూపిస్తామంటూ IRGC తీవ్రంగా హెచ్చరించడం గమనార్హం.

ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తెలిపిన వివరాల ప్రకారం, హైఫా రిఫైనరీ కాంప్లెక్స్ వద్ద మంటలు చెలరేగాయి. విద్యుత్ సరఫరాకు స్వల్ప అంతరాయం కలిగిందని వివరించింది. అయితే, పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి. కానీ, ఇరాన్ చేసిన దాడుల వల్ల హైఫా పోర్ట్ కార్యకలాపాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ నివేదికలు వెల్లడించింది.వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్‌కు ఎంతో కీలకమైన ఈ పోర్ట్ ను
అదానీ గ్రూప్ నిర్వహిస్తుంది.
 

Advertisment
తాజా కథనాలు