/rtv/media/media_files/2026/04/08/fotojet-2-2026-04-08-17-57-14.jpg)
TRUMP 10 POINTS : ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన ఓ భీకర యుద్ధం...2 వారాల సీజ్ ఫైర్ డీల్‌తో ఆగింది. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్స్, ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్స్‌తో నడిచిన ఈ హైడ్రామాలో అసలు గెలిచింది ఎవరు..పవర్ ఫుల్ అమెరికానా? లేక పట్టువదలని విక్రమార్కుడిలా నిలిచిన ఇరానా..? పైకి ఇద్దరూ విజయం మాదే అని చెప్పుకుంటు న్నారు. కానీ, లోతుగా పరిశీలిస్తే...ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయనకే రివర్స్ అయిందనిపిస్తోంది. తన పంతం నెగ్గించుకోలేక, ఇరాన్‌ను లొంగదీసుకోలేక మహాభారతంలో వసుదేవుడు గాడిద కాళ్లు మొక్కిన చందంగా..చివరకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ట్రంప్ వ్యూహం ఎందుకు విఫలమైందో, ఇరాన్ ఎలా పైచేయి సాధించిందో తెలుసుకుందాం.
1.మిషన్ ఫెయిల్డ్
నిజానికి ట్రంప్ అసలు యుద్ధాన్ని ప్రారంభించింది ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి. కానీ ఇరాన్ లొంగకపోగా, తన కండీషన్స్‌తోనే సీజ్‌ఫైర్‌కు వచ్చేలా చేసింది.
2.సెల్ఫ్ గోల్
యుద్ధం స్టార్ట్ కాకముందు హార్ముజ్ జలసంధి మామూలుగానే తెరిచి ఉంది. ట్రంప్ తెచ్చిన ఉద్రిక్తత వల్ల ఇరాన్ హార్మూజ్‌ను మూసివేసింది. చివరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ను తెరిపించేందుకే యుద్ధం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది ఇరాన్. ఇది అమెరికాకు పెద్ద దెబ్బ.
3. ఫైనాన్షియల్ క్రైసిస్
యుద్ధం ముప్పుతో ఆయిల్ ధరలు పెరిగి అమెరికా ఎకానమీపై భారం పడింది. యుద్ధ సన్నాహాల కోసం చేసిన మిలిటరీ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరైంది.
4. ఇరాన్ యురేనియం
నిజానికి ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడమే అమెరికా మెయిన్ టార్గెట్. కానీ సీజ్‌ఫైర్ తర్వాత కూడా ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలు అలాగే ఉన్నాయి. ట్రంప్ వాటిని ముట్టుకోలేకపోయారు.
5. మిత్రదేశాల మద్దతు కరువు
ఇరాన్‌తో యుద్ధంలో యూరప్ దేశాలు అమెరికాకు సపోర్ట్ చేయలేదు. ఓ రకంగా చెప్పాలంటే బహిరంగంగానే ట్రంప్‌ను యూరప్ దేశాలు తప్పు పట్టాయి. దీంతో ట్రంప్ అంతర్జాతీయంగా ఒంటరి అయ్యారు.
6.ఇరాన్ రెసిస్టెన్స్
అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్ ఎదురు నిలిచింది. మేము అమెరికాను ఎదురించగలమని ప్రపంచానికి నిరూపించింది. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ తన పట్టును ఇంకా పెంచుకుంది.
7.పాకిస్థాన్ మెడియేషన్
సూపర్ పవర్, పెద్దన్న, అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా, ఒక చిన్న దేశం, అది పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించే వరకు ఆగాల్సి రావడం అమెరికా ఇమేజ్‌ను తగ్గించింది.
8.ఇజ్రాయెల్ ఈజ్ అన్‌హ్యాపీ
ట్రంప్ తీసుకున్న సీజ్‌ఫైర్ డెసిషన్ వల్ల ఇజ్రాయెల్ లాంటి సన్నిహిత మిత్రదేశం కూడా హ్యాపీగా లేదు. నిజానికి ఇరాన్ రెజీమ్‌ను అంతం చేయాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. ఆ దిశగానే ఇజ్రాయెల్ ప్రయత్నం చేసింది. కానీ చివరకు ట్రంప్ ఇరాన్‌కు తలొగ్గారు. ఇది ఇజ్రాయెల్‌కు నచ్చలేదు. అంటే ట్రంప్ తన మిత్రులను కూడా సాటిస్‌ఫై చేయలేకపోయారు.
9.స్ట్రాటజిక్ ఫెయిల్యూర్
యుద్ధం స్టార్ట్ చేసి టార్గెట్ రీచ్ అవకుండానే వెనక్కి తగ్గడం వల్ల..అమెరికా తన ఇమేజ్‌ను కోల్పోయింది. ప్రపంచ దేశాలు అమెరికాకు భయపడే పరిస్థితి భవిష్యత్‌లో ఉండకపోవచ్చు. ఏ చిన్న దేశమైనా అమెరికాను ఎదిరించవచ్చనే సిగ్నల్ వెళ్ళింది.
10. డొమెస్టిక్ ప్రెజర్
అమెరికా లోపలే ట్రంప్ నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. సొంత దేశంలోనే ఆయన మద్దతు సంపాదించుకోలేకపోయారు. ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్డెక్కారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం ట్రంప్
11.ఇరాన్ మోరల్ విక్టరీ
యుద్ధం జరగకుండానే అమెరికాను టేబుల్ మీదకు రప్పించాం అని ఇరాన్ ప్రజల్లో పండగ చేసుకుంటున్నారు. ఇది ఇరాన్ ప్రభుత్వానికి పెద్ద బూస్ట్. అమెరికాకు చెంప దెబ్బ.
12. శాంక్షన్స్ ఫెయిల్డ్
ఇన్నాళ్లు విధించిన ఆంక్షలు, యుద్ధం ఇరాన్‌ను మార్చలేకపోయాయని ఈ సీజ్‌ఫైర్ నిరూపించింది. మొత్తంగా
యుద్ధం ప్రకటించి, ఆపై చర్చలకు సిద్ధమవ్వడం అనేది మొరిగే కుక్క కరవదు అన్న సామెతను గుర్తు చేస్తోంది. ఇది ట్రంప్ ఇమేజ్‌కు తీరని నష్టం.
Follow Us