/rtv/media/media_files/2026/05/28/dance-of-death-2026-05-28-18-03-58.jpg)
-Ravi prakash
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/27/ravi-prakash-2026-05-27-18-35-07.jpeg)
నేను జర్నలిజంలో చాలా డిస్టర్బింగ్ వీడియోలు చూశాను. కానీ, ఈ రోజు చూసిన వీడియో మాత్రం కొన్నేళ్లుగా నేను చూసిన అత్యంత షేమ్‌ఫుల్ వీడియోల్లో ఒకటని చెప్పాలి. ఎందుకంటే, ఇది కేవలం ఒక సెలబ్రేషన్ వీడియో కాదు. ఇది, మనదేశ న్యాయవ్యవస్థకి చెంపదెబ్బలా అనిపించింది. విషయం ఏంటంటే, అనీష్ అవధియా, అశ్విని కోష్టా, పుణెలో జరిగిన ఫ్ఫోషకార్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. దీంతో, రెండు కుటుంబాలు శాశ్వతంగా చీకట్లోకి వెళ్లిపోయాయి. పిల్లలను కోల్పోయిన పేరెంట్స్ తల్లడిల్లిపోతున్నారు. అదే కేసుతో సంబంధం ఉన్న కుటుంబం, ఇప్పుడు బెయిల్ వచ్చిందని డ్యాన్స్ చేస్తోంది. కరెన్సీ నోట్ల దండలు వేసుకుని సెలబ్రేట్ చేసుకుంటోంది. వీళ్లేమైనా ఎన్నికల్లో గెలిచారా? కోర్టు నిర్దోషులని ప్రకటించిందా? అసలు వీరిలో ఒక్క క్షణం కూడా పశ్చాత్తాపం కనిపించడం లేదు. ఆ గిల్టీనెస్ కూడా లేదు.
ఈ వీడియో చూస్తుంటే నాకు ఒకటే గుర్తుకొస్తోంది. మనదేశంలో డబ్బు మనుషులను మాత్రమే కాదు. న్యాయాన్ని కూడా చంపేస్తుందా అని. మీరు ఈ వీడియో ఒక్కసారి సరిగ్గా చూడండి.. సెలబ్రేషన్స్ అబ్జర్వ్ చేయండి. వారిలో ఆ కాన్ఫిడెన్స్ గమనించండి. ఈరోజు రాత్రి అనీష్, అశ్విని పేరెంట్స్ ఎలాంటి స్థితిలో ఉంటారు?
వీడియో చూశారు కదా, మీకు ఏమనిపిస్తోంది? అది సెలబ్రేషనా? లేక, ఈ దేశంలో అకౌంటబిలిటీకి జరిగిన అంత్యక్రియా? ఒకవైపు, బాధితుల తల్లిదండ్రులు నరకయాతన పడుతుంటే, వీళ్లు సెలబ్రేషన్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. పుణే ఫ్ఫోష కారు ఘటన ఒక సాధారణ యాక్సిడెంట్ కేసు కాదు. అదొక స్టేటస్ సింబల్. ప్రివిలేజ్‌కు సింబల్. పవర్‌కు సింబల్. డబ్బుతో న్యాయాన్ని నెగోషియేట్ చేయొచ్చనే భయంకరమైన నమ్మకానికి సింబల్.
ఇంతకీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది? 2024 మే నెలలో ఈ యాక్సిడెంట్ జరిగింది. స్పీడ్‌గా వెళ్తున్న ఒక ఫ్ఫోష కారు, బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువ టెకీలను ఢీకొట్టింది. వాళ్లే అనీష్ అవధియా. అశ్విని కోష్టా. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. కారు నడిపింది ఒక మైనర్.. డ్రింక్ చేసి పార్టీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అయితే దేశాన్ని షాక్‌కు గురి చేసింది యాక్సిడెంట్ కాదు. బెయిల్. ఇద్దరి మరణానికి కారణమైన అబ్బాయికి జువెనైల్ జస్టిస్ బోర్డు వెంటనే బెయిల్ ఇచ్చింది. అంతేకాదు, కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. అవేంటంటే, ఒక ఎస్సే రాయాలి. ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలి. కౌన్సెలింగ్ తీసుకోవాలని చెప్పింది. దీంతో బాధిత కుటుంబాలకే కాదు.. కామన్ పీపుల్‌కూ మండిపోయింది.
రెండు నిండు ప్రాణాలను తీసిన వాడికి ఇదేనా శిక్ష అంటూ పబ్లిక్‌లో రియాక్షన్ పెరిగింది. దీంతో సిస్టమ్ మళ్లీ రెస్పాండ్ అయ్యింది. మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు. మళ్లీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచే కేసులో ట్విస్ట్‌లు మొదలయ్యాయి. ఎందుకంటే, ఒకవైపు, సాక్ష్యాలను మార్చారని, మరోవైపు, బ్లడ్ శాంపిల్స్ కూడా మార్చేశారన్న ఆరోపణలు వచ్చాయి. చివరకు డాక్టర్స్‌ను అరెస్ట్ చేశారు. అప్పుడే పొలిటికల్ పవర్ కూడా ఎంటరైంది.
NCP లీడర్ సునీల్ టింగ్రే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఘటన అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. మైనర్ అబ్బాయి కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం జరిగిందని విమర్శకులు ఆరోపించారు. ఎందుకంటే, అది కేవలం రోడ్డు ప్రమాదం కాదు. డబ్బున్నవాళ్లు ఏమైనా చేయగలరా? అనే ప్రశ్న తలెత్తింది.
నిజం చెప్పాలంటే, ఈ కేసులో ఇప్పుడు డిస్టర్బింగ్ మేటర్ యాక్సిడెంట్ కూడా కాదు. ఈ సెలబ్రేషన్సే. ఇలాంటివే సైకాలజీని బయటపెడతాయి. ఒరిజినల్ బిహేవియర్‌ను ఎక్స్‌పోజ్ చేస్తాయి. ఈ డ్యాన్స్‌లు చూసిన తర్వాతే జస్టిస్‌పై పబ్లిక్ రగిలిపోతున్నారు. ఈ ఇష్యూలో మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే, రెండు ప్రాణాలు బలిగొన్న మైనర్ అబ్బాయిది పేద కుటుంబమే అయితే, టాప్ లాయర్స్ దొరికేవారా? ఇంత త్వరగా బెయిల్ వచ్చేదా? పాలిటికల్ యాక్సెస్ ఉండేదా? నారేటివ్ మేనేజ్‌మెంట్ జరిగేదా? అనే ప్రశ్నలు జనం అడుగుతున్నారు. అందుకే ఈ కేసు దేశాన్ని ఎమోషనల్‌గా హర్ట్ చేస్తోంది.
మనం మాట్లాడుకుంటోంది చట్టం గురించి కాదు.. చట్టం ముందు అందరూ సమానమేనా? అనే అంశం గురించి. ప్రతి సంవత్సరం, మనదేశంలో వేలాది మంది, ఎవరో మద్యం తాగి డ్రైవ్ చేసిన కారణంగా చనిపోతూనే ఉన్నారు. కుటుంబాలు కూలిపోతున్నాయి. పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి కేసుల్లో చాలా సందర్భాల్లో నిందితులకు పడే శిక్ష చాలా చిన్నదిగా ఉంటోంది.
ఎవరైనా చనిపోతే
అదే అమెరికాలో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎవరైనా చనిపోతే.. అందుకు కారణమైన వారికి దశాబ్దాలపాటు జైలు శిక్ష పడుతుంది. మెకెన్జీ షిరిల్లా కేసులో, కారును స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఇద్దరిని చంపిందని కోర్టు నిర్దారించింది. ఈ కేసులో ఆమెకు జీవిత ఖైదు విధించారు. ఆ టైమ్‌లో జడ్జి ఏమన్నారంటే, కేసు నుంచి ఆమెను మైనర్ వయసు కాపాడలేదు. ప్రివిలేజ్ కాపాడలేదు. డబ్బు కాపాడలేదని చెప్పారు. కానీ మనదేశంలో ఏం జరుగుతోంది? ఇదే ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. అసలు విషాదం ఏమిటంటే, డబ్బున్నవాళ్లు ఎలాంటి చట్టాల నుంచైనా తప్పించుకోగలరు.. వారి దెబ్బకు సిస్టమ్ కూడా స్లో అవుతుంది. ఇన్‌ఫ్లుయెన్స్ పెరుగుతుంది. పబ్లిక్ అవుట్‌రేజ్ తగ్గిపోతుంది. బాధితులకు మాత్రం బాధ మిగులుతుంది. ఇది కరప్షన్ కంటే పెద్ద ప్రమాదకారి.
అనీష్ అవధియా. అశ్విని కోష్టా. ఈ రెండు పేర్లు మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే, ఇలాంటి ఘటనల్లో, మనం కూడా బాధితులను మర్చిపోతాం. చట్టం గురించి మాట్లాడుతాం. బెయిల్ గురించి డిబేట్ చేస్తాం. పాలిటిక్స్ గురించి కూడా చర్చ చేస్తాం.. కానీ, తిరిగి రాని ఇద్దరు మనుషుల గురించి మర్చిపోతాం. ఎక్కడో ఒకచోట, ఇంకా వాళ్ల తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. బ్రతకడానికి ప్రయత్నిస్తున్నారు. మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. సేమ్ టైమ్ ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ మన జస్టిస్ సిస్టమ్ పతనానికి పరాకాష్టగా నాకు కనిపిస్తున్నాయి.
Follow Us