/rtv/media/media_files/2025/03/31/jtwSMNPY3Oj0ELEBglmP.jpg)
China stole documents Photograph: (China stole documents)
థాయ్‌లాండ్‌లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. సహాయక చర్యల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో 33 అంతస్థుల భవనం కుప్పకూలింది. అయితే ఆ ప్రమాద స్థలంలోనుంచి కొన్ని పత్రాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు కొందరు ప్రయత్నించారు. సహాయక బృందాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. డాక్యుమెంట్స్ దొంగలించాలనుకున్న ఐదుగురు చైనాకు చెందిన వాళ్లు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
Also read: Fire accident: ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. అందులోనే 15 మంది కార్మికులు
Why nobody talking about this ??
— Gaurav28 (@gauravlokhande) March 31, 2025
4 Chinese Men Try To "Remove" Documents From Bangkok Collapse Site, Detainedhttps://t.co/4AO8zY6O3l
Source : "NDTV" via Dailyhunt
చైనాకు చెందిన రైల్వే నంబర్ 10 కంపెనీ 2018లో థాయ్‌లాండ్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. హౌజింగ్ సొసైటీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఇతర బడా కాంట్రాక్టులను ఈ కంపెనీ స్థానిక కంపెనీలతో జాయింట్ వెంచర్‌గా నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో థాయ్‌లాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కోసం సుమారు 58 బిలియన్ డాలర్లతో మూడేళ్ల కిందట పనులు చేపట్టారు.
Also read: BREAKING: HCU భూముల అమ్మకంపై యూనివర్సిటీ కీలక ప్రకటన
తాజా భూకంపం ధాటికి నిర్మాణంలో ఉన్న ఆ భవనం కుప్పకూలిపోగా శిథిలాల నుంచి ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. ఇంతకంటే ఎక్కువ పెద్ద బిల్డింగులకు ఏం కాలేదు. దీంతో డిజైనింగ్‌లో లోపాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. థాయ్‌లాండ్ ఉప ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ సైతం ప్రమాద స్థలిని సందర్శించి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఆ బిల్డింగ్ నిర్మాణంలో పని చేస్తున్న చైనా కార్మికులు డిజైన్ కాపీని మాయం చేద్దామని ట్రై చేశారు. అది కాస్త థాయ్‌లాండ్ అధికారులు కంటపడింది. రెస్క్యూ టీంలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పాయి. వారిని ప్రశ్నించగా.. చైనా దేశస్థులని తెలిసింది. అయితే.. అందులో ఒకరు తాను ప్రాజెక్ట్ మేనేజర్ అని, బీమా క్లెయిమ్ చేసుకోవడం కోసం సంబంధిత పత్రాలు తీసుకెళ్లేందుకు వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.