Astronomical Event : ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు! సీ/2023 ఏ3 తోకచుక్క సెప్టెంబరు 28, 2024న సూర్యుడికి దగ్గరగా వచ్చింది ఆ రోజు నుంచి సూర్యుడికి దూరంగా కదలడం ప్రారంభించింది. ఈ తోకచుక్క అరుదైన ఖగోళ విశేషమని, మరో 80,000 సంవత్సరాల వరకు ఇది కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. By Bhavana 16 Oct 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి అద్భుత ఖగోళ దృశ్యాలను చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపించే భారత ఔత్సాహికులకు ఓ శుభవార్త. మరో అరుదైన ఖగోళ దృశ్యం వినీలాకాశంలో కనువిందు చేయనుంది. జనవరి 2023లో గుర్తించిన సీ/2023 ఏ3 అనే తోకచుక్క ప్రస్తుతం భారత్ నుంచి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఔత్సాహికులు దీనిని సాధారణ కళ్లతో కూడా చూడవచ్చని, మసకబారిన బంతిలా కనపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే టెలిస్కోప్‌తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. Also Read: దేనితో కొట్టాలి రేవంత్.. కేటీఆర్ సంచలన ట్వీట్! 80,000 సంవత్సరాల.. సీ/2023 ఏ3 తోకచుక్క సెప్టెంబరు 28, 2024న సూర్యుడికి దగ్గరగా వచ్చింది ఆ రోజు నుంచి సూర్యుడికి దూరంగా కదలడం ప్రారంభించింది. అందుకే ప్రస్తుతం భూమి నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తోకచుక్క అరుదైన ఖగోళ విశేషమని, మరో 80,000 సంవత్సరాల వరకు ఇది కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ దశాబ్దకాలంలో ఇదే అత్యంత ప్రకాశవంతమైన తోకచుక్క అని వివరించారు. Also Read: Priyanka Chopra భర్తకు ప్రమాదం..? షో మధ్యలోనే పారిపోయిన నిక్! భారతదేశం అంతటా ఈ తోకచుక్క కనిపిస్తోంది. అక్టోబర్ 14-24 మధ్య ఇది మరింత స్పష్టంగా కనపడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు సూర్యోదయానికి ముందు తెల్లవారుజాము సమయం ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచించారు. ఇక అక్టోబర్ 12 నుంచి ఈ తోకచుక్క సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ దిశలో కూడా కనపడుతుందని వివరించారు. Also Read: మోదీకి లోకేష్ సారీ చెప్పడంపై షర్మిల విమర్శల దాడి ఈ తోకచుక్కకు సంబంధించి ఖగోళ ఫోటోగ్రాఫర్లు, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు తీసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి కొందరు ఈ ఫొటోలు తీశారు. ఈ చిత్రాలలోని తోకచుక్క పొడవాటి తోకతో మెరుస్తూ కనిపిస్తోంది. అయితే భారతదేశంలో ప్రస్తుతం ఆకాశం స్పష్టంగా ఉన్న లడఖ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి తోకచుక్క స్పష్టంగా కనపడుతుందన శాస్త్రవేత్తలు తెలిపారు. Also Read: 'అఖండ 2 - తాండవం'... మాస్ డైలాగ్ తో ఇరగదీసిన బాలయ్య.. వీడియో వైరల్ #astronomical-event మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి