TRUMP : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌కు బిగ్‌షాక్.. NCTC చీఫ్ రాజీనామా

ఇరాన్‌ పై యుద్ధం కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ NCTC చీఫ్ జోసెఫ్ కెంట్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. యుద్ధానికి మద్దతు ఇవ్వలేక రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు.

New Update
FotoJet (5)

NCTC chief Joseph kent

TRUMP : ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌ పై యుద్ధం కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ NCTC చీఫ్ జోసెఫ్ కెంట్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.ఇరాన్‌పై అమెరికా యుద్ధం సరైంది కాదన్న కెంట్‌ దానికి నా మనస్సాక్షి అంగీకరించడం లేదన్నారు.అందుకే యుద్ధానికి మద్దతు ఇవ్వలేను, రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు.ఇరాన్‌తో అమెరికాకు తక్షణమే వచ్చే ప్రమాదం ఏం లేదు అని కెంట్‌ అభిప్రాయపడ్డారు.కేవలం ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ట్రంప్ యుద్ధం ప్రారంభించారన్నారు.మిడిల్ ఈస్ట్ వార్‌ వల్ల అమెరికాకు ప్రాణనష్టం, ఆస్తి నష్టం తప్ప...మరేమి ఉండదని ట్రంప్‌కు తెలుసు. జూన్ 2025 తర్వాత ఆయన నిర్ణయం మారిందన్నారు. ఇజ్రాయెల్‌ ఉన్నతాధికారులు, అమెరికా మీడియాలోని...కొందరు ప్రముఖ వ్యక్తులు తప్పుడు ప్రచారం నడిపారని తద్వారా ఇరాన్‌తో యుద్ధాన్ని ప్రొత్సహించారన్నారు.

కాగా ఇరాన్‌ తో యుద్దంపట్ల ట్రంప్‌ తీరుపై అమెరికా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ న్యూయార్క్, వాషింగ్టన్ డి.సి... లాస్ ఏంజిల్స్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో సహా 50 నగరాల్లో నిరసనలు జరిగాయి. నో మోర్ వార్స్ అంటూ ప్లకార్డుల ప్రదర్శిస్తూ ఆందోళనలు నిర్వహించారు.అమెరికా పార్లమెంట్‌లోనూ యుద్ధంపై తీవ్ర చర్చ జరగింది.  డెమోక్రాట్లు యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంట్ అనుమతి లేకుండా యుద్ధం ప్రారంభించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ సొంత పార్టీలోనూ ఓ వర్గం ట్రంప్‌ తీరును వ్యతిరేకిస్తుంది.అమెరికా డబ్బును, సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Advertisment
తాజా కథనాలు