Donald Trump : ట్రంప్ సర్కార్‌లో ప్రక్షాళన: కీలక అధికారులపై వేటు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలనలో భారీ మార్పులకు సిద్ధమవుతున్నారా? ప్రస్తుతం వైట్ హౌస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌లను పదవుల నుంచి తొలగించే అవకాశం ఉంది.

New Update
us

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలనలో భారీ మార్పులకు సిద్ధమవుతున్నారా? ప్రస్తుతం వైట్ హౌస్ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌లను పదవుల నుంచి తొలగించే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

ది అట్లాంటిక్ రిపోర్ట్ ప్రకారం.. కాష్ పటేల్‌తో పాటు ఆర్మీ సెక్రటరీ డేనియల్ డ్రిస్కోల్, లేబర్ సెక్రటరీ లోరి చావెజ్-డెరెమర్‌లను పక్కన పెట్టేలా చర్చలు జరుగుతున్నాయి. కాష్ పటేల్‌ను తక్షణమే తొలగించే అవకాశం ఉందని కన్సర్వేటివ్ వ్యాఖ్యాత కైల్ సెరాఫిన్ కూడా పేర్కొన్నారు. ట్రంప్ తనపై ఒత్తిడి ఉందన్న భావన రాకుండా, తన సొంత నిర్ణయంలా కనిపించేలా ఈ మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు తులసీ గబ్బార్డ్ స్థానంలో మాజీ అటార్నీ జనరల్ పామ్ బాండీని తీసుకురావాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఇరాన్ విషయంలో గబ్బార్డ్ తీసుకున్న స్టాండ్ ట్రంప్‌కు నచ్చలేదని టాక్. ఇరాన్ నుంచి అమెరికాకు తక్షణ ముప్పు లేదని వ్యాఖ్యానించి రాజీనామా చేసిన తన డిప్యూటీ జో కెంట్‌ను ఆమె వెనకేసుకురావడంపై ట్రంప్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో గబ్బార్డ్ కాస్త మెతక వైఖరితో ఉన్నారని ట్రంప్ భావిస్తున్నారు. అయితే, బహిరంగంగా మాత్రం ఆమెకు తన మద్దతు ఉంటుందని ట్రంప్ చెబుతున్నారు.

రక్షణ శాఖలోనూ మార్పులు

కేవలం ఇంటెలిజెన్స్ విభాగంలోనే కాదు, రక్షణ శాఖలోనూ మార్పులు మొదలయ్యాయి. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇప్పటికే ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను పదవి నుంచి తప్పుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే, పామ్ బాండీ అటార్నీ జనరల్ పదవి నుంచి తప్పుకోగా, టాడ్ బ్లాంచే తాత్కాలికంగా ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. మొత్తానికి ట్రంప్ టీమ్‌లో ఎప్పుడు ఎవరు ఉంటారో, ఎవరు వెళ్తారో తెలియని ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ, అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని, పదవీ విరమణ చేయాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక సైనిక నాయకత్వంలో జరుగుతున్న భారీ ప్రక్షాళనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు