Frankfurt Airport : ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం: పార్కింగ్‌లో ఉండగానే కుప్పకూలిన విమానం!

జర్మనీలోని అత్యంత రద్దీగా ఉండే ఫ్రాంక్‌ఫర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఊహించని ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక భారీ బోయింగ్ విమానం రన్‌వే పక్కన పార్క్ చేసి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది.

New Update
airport

జర్మనీలోని అత్యంత రద్దీగా ఉండే ఫ్రాంక్‌ఫర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఊహించని ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక భారీ బోయింగ్ విమానం రన్‌వే పక్కన పార్క్ చేసి ఉన్న సమయంలో అకస్మాత్తుగా ప్రమాదానికి గురైంది. విమానం నిలబడి ఉన్న చోటే దాని ముందు భాగంలో ఉండే ల్యాండింగ్ గేర్ ఒక్కసారిగా లోపలికి ముడుచుకుపోవడంతో విమానం ముందు భాగం నేలకేసి బలంగా కొట్టుకుంది. ఈ ప్రమాదంలో విమానంలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది గాయపడ్డారు.

ఈ ప్రమాదం జరిగే సమయానికి విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరు. ప్రయాణికులు విమానం ఎక్కడానికి కాస్త ముందే, మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. అయితే, ఆ సమయంలో విమానం లోపల క్యాబిన్ సిబ్బందితో పాటు కింద కార్గో లోడింగ్ చేస్తున్న గ్రౌండ్ స్టాఫ్ ఉన్నారు. ల్యాండింగ్ గేర్ ఒక్కసారిగా విరిగిపోవడంతో విమానం కొన్ని మీటర్ల ఎత్తు నుండి కింద పడటంతో లోపల ఉన్న కొందరు ఉద్యోగులకు గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.

ఈ విమానం ఫ్రాంక్‌ఫర్ట్ నుండి అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరానికి  వెళ్లాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు మరియు లుఫ్తాన్సా యాజమాన్యం ఆ ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేశాయి. ప్రయాణికులను వేరే విమానాల్లో పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

చాలా భారీగా నష్టం

ఈ ప్రమాదంలో విమానానికి చాలా భారీగా నష్టం వాటిల్లింది. విమానం ముందు భాగం, విమానం కడుపు భాగం, ఇంజిన్లు మరియు ఫ్రంట్ కార్గో లోడింగ్ డోర్ పూర్తిగా దెబ్బతిన్నాయి. సామాన్లు ఎక్కించే ఒక వెహికల్ కూడా విమానం కింద నలిగిపోయింది. అయితే, ఈ ప్రమాదం అందరినీ తీవ్రంగా ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే, ప్రమాదానికి గురైన బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్  విమానం చాలా కొత్తది. రికార్డుల ప్రకారం.. 2025లో తయారైన ఈ బ్రాండ్ న్యూ విమానాన్ని లుఫ్తాన్సా సంస్థ కేవలం 2026 జనవరిలోనే డెలివరీ తీసుకుంది. ఫిబ్రవరి 2026 నుండి ఇది తన ప్రయాణాలను మొదలుపెట్టింది. విమానం కొని కనీసం ఏడాది కూడా గడవకముందే, కేవలం నాలుగు నెలల సర్వీస్‌లోనే ఇలాంటి సాంకేతిక లోపం రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సిబ్బంది చేసిన మానవ తప్పిదమా? లేక విమానంలోనే ఏదైనా మాన్యుఫ్యాక్చరింగ్ లోపం ఉందా? అనే కోణంలో లుఫ్తాన్సా సంస్థ మరియు జర్మనీ విమానయాన అధికారులు విచారణ ప్రారంభించారు.

Advertisment
తాజా కథనాలు