/rtv/media/media_files/2026/05/31/ukraine-deploys-robots-into-war-2026-05-31-18-05-35.jpg)
Ukraine Deploys Robots Into War
Russia Ukraine War : రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధం ఇప్పుడు మానవరహిత యంత్రాల పోరాటంగా మారిపోయింది. గత నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న ఈ వినాశకర యుద్ధంలో యుక్రెయిన్ సైన్యం తీవ్రమైన సైనికుల కొరతను ఎదుర్కొంటోంది. అయితే, ఈ బలహీనతను అధిగమించడానికి యుక్రెయిన్ యుద్ధరంగంలో ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. యుద్ధభూమిలో తమ సొంత మానవ సైన్యానికి బదులుగా 'రోబోటిక్ ఆర్మీ' (యంత్ర సైన్యం)ని రంగంలోకి దించింది. వీటికి ఆకలి, దప్పిక ఉండవు.మరణం అనే భయం అంతకన్నా ఉండదు.
Ukraine tests humanoid combat robots on front lines in emerging warfare experiment
— Washington Eye (@washington_EY) May 30, 2026
Ukraine is reportedly trialing Phantom humanoid robots developed by Foundation Future Industries, a U.S.-based company linked to Eric Trump.
The robots are being evaluated for logistics,… pic.twitter.com/L3EcbmmjuQ
ప్రస్తుతం ఉక్రెయిన్ తన సైనికులను నేరుగా యుద్ధరంగంలోకి పంపకుండానే, రిమోట్ కంట్రోల్, స్క్రీన్ల సహాయంతో రష్యా సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. కేవలం రోబోలు, డ్రోన్ల సహాయంతోనే తమ సైన్యం మొదటిసారిగా ఒక రష్యా సైనిక స్థావరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుందని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు సరిహద్దుల్లో ముఖాముఖి తలపడే కమాండర్లు, ఇప్పుడు ఫ్రంట్‌లైన్‌కు చాలా దూరంగా కూర్చుని కంట్రోల్ సెంటర్ల నుండి ఈ రోబోటిక్ యుద్ధాన్ని నడిపిస్తున్నారు.
ఆకాశంలో ఎగురుతున్న నిఘా డ్రోన్లు రష్యా సైనికుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతుండగా, కంట్రోల్ రూమ్‌లో ఉన్న ఉక్రెయిన్ ఆపరేటర్లు స్క్రీన్‌లపై చూస్తూ పేలుడు పదార్థాలతో నిండిన రోబోలను శత్రు స్థావరాల వైపు నడిపిస్తున్నారు. జనాభా పరంగా రష్యా కంటే చాలా చిన్నదైన ఉక్రెయిన్, ఈ నాలుగేళ్ల యుద్ధంలో ఎందరో వీర సైనికులను కోల్పోయింది. ఈ సైనికుల కొరత మరియు పాశ్చాత్య దేశాల నుండి వచ్చే సైనిక సహాయంపై ఉన్న అనిశ్చితి కారణంగా యుక్రెయిన్ ఈ రోబోటిక్ టెక్నాలజీని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసింది. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు ఈ మానవరహిత వ్యవస్థలు 22 వేలకు పైగా మిషన్లను విజయవంతంగా పూర్తి చేశాయి.
ఉక్రెయిన్ ఉపయోగిస్తున్న ఈ భూతల రోబోలు రష్యా సైన్యంలో ఎంతటి భయాందోళనలు సృష్టిస్తున్నాయంటే, పట్టుబడిన రష్యా సైనికులు వీటికి ‘సైలెంట్ డెత్’ (నిశ్శబ్ద మరణం) అని పేరు పెట్టారు. ఈ రోబోటిక్ బాంబు క్యారియర్లు ఎంత నిశ్శబ్దంగా ముందుకు సాగుతాయంటే, శత్రువులకు కేవలం 10 మీటర్ల దూరంలోకి వచ్చే వరకు వాటి ఉనికి అస్సలు తెలియదు. ఒకప్పుడు డోన్‌బాస్ ప్రాంతంలో ఇండ్ల మధ్య ముఖాముఖి పోరాటం చేసినఉక్రెయిన్ డిప్యూటీ కమాండర్ 'బార్' మాట్లాడుతూ.. ఈ సాంకేతికత తమ వద్ద ముందే ఉండి ఉంటే తమ తోటి సైనికులు ఎందరో ఈరోజు బతికి ఉండేవారని, ఇప్పుడు యుద్ధంలో శారీరక బలం కంటే సాంకేతికతే సర్వస్వం నిర్ణయిస్తోందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, ప్రతి నెల దాదాపు 35,000 మంది రష్యా సైనికులను హతమార్చడమే లక్ష్యంగా యుక్రెయిన్ అధికారులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఈ టార్గెట్‌ను వారు నిరంతరం అందుకుంటున్నారు. రష్యా సైన్యానికి ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లితే, క్రెమ్లిన్ (రష్యా ప్రభుత్వం) నగరాల నుండి,మధ్యతరగతి కుటుంబాల నుండి బలవంతంగా సైనిక రిక్రూట్‌మెంట్ చేయాల్సి వస్తుందని, తద్వారా రష్యాలోనే పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తి పెరుగుతుందని ఉక్రెయిన్ భావిస్తోంది. బ్రిటన్ నిఘా సంస్థ 'GCHQ' తాజా అంచనాల ప్రకారం.. ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Follow Us