/rtv/media/media_files/2026/02/26/us-f-22-fighter-2026-02-26-08-28-31.jpg)
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా కీలక అడుగు వేసింది. ప్రపంచంలోనే లెటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఎఫ్22 రాప్టర్ స్టెల్త్ 12 యుద్ధ విమానాలను అమెరికా ఇజ్రాయెల్‌కు తరలించింది. ఇరాన్ నుంచి ఎదురయ్యే ప్రమాధాన్ని తిప్పికొట్టడానికి, ఈ ప్రాంతంలో తమ పట్టు నిరూపించుకోవడానికి ఎఫ్ 22 ఫైటర్ జెట్లు మోహరించినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధ విమానాలు ఫిబ్రవరి 24 బ్రిటన్‌లోని లాకెన్‌హీత్ ఎయిర్‌బేస్ నుండి బయలుదేరి దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఒక వ్యూహాత్మక వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ గడ్డపై ఎఫ్-22 విమానాలను ఉంచడం అనేది ఒక అరుదైన చర్య. ఇది కేవలం శిక్షణ కోసం కాదని, ఆపరేషనల్ పనుల కోసమేనని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ యుద్ధ విమానాలు తమ గమ్యాన్ని రహస్యంగా ఉంచేందుకు, రాడార్లకు చిక్కకుండా 'ట్రాన్స్‌పాండర్లను' ఆఫ్ చేసి ప్రయాణించాయి. వీటితోపాటు ఇంధనాన్ని నింపే ట్యాంకర్ విమానాలు కూడా వెళ్లాయి. ఇరాన్ అణు కార్యక్రమాలు, క్షిపణి పరీక్షలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ, ఇరాన్‌ను అడ్డుకోవడానికి అవసరమైతే సైనిక చర్యకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు.
ఎఫ్-22 రాప్టర్ ప్రత్యేకతలు
ఎఫ్-22 విమానాలను అమెరికా మరే ఇతర దేశానికి విక్రయించదు. వీటిని కేవలం అమెరికా వైమానిక దళం మాత్రమే ఉపయోగిస్తుంది.
స్టెల్త్ టెక్నాలజీ: శత్రువుల రాడార్ల కంటపడకుండా ఆకాశంలో దూసుకెళ్లగలవు.
సూపర్ సోనిక్ వేగం: ధ్వని కంటే వేగంగా ప్రయాణించడంతో పాటు శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయగలవు.
కచ్చితమైన దాడులు: గాలిలోని లక్ష్యాలను చేధించడమే కాకుండా, భూమిపై ఉన్న శత్రు స్థావరాలను కచ్చితత్వంతో ధ్వంసం చేస్తాయి.
గత ఏడాది జరిగిన 'ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్' తర్వాత ఇరాన్ అణు కార్యకలాపాలను మళ్లీ మొదలుపెట్టిందని అమెరికా ఆరోపిస్తోంది. జెనీవాలో చర్చలు జరుగుతున్నప్పటికీ, ఫలితం లేకపోతే సైనిక దాడులు తప్పవని ఇజ్రాయెల్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో అమెరికాకు చెందిన USS గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ మరియు USS అబ్రహం లింకన్ వంటి యుద్ధ నౌకలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
Follow Us