Yoga Day : యోగా ఎక్కడ పుట్టిందో తెలుసా..? 

ఎన్నో అద్భుతాలకు, మరెన్నో ఆచార వ్యవహారాలకు నిలయమైన భారత్‌ లోనే యోగా కూడా పుట్టింది. ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా యోగా ప్రస్తావన ఉంది. ఇండియాలో పుట్టిన యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది.

New Update
Yoga Day : యోగా ఎక్కడ పుట్టిందో తెలుసా..? 

International Yoga Day 21st June : ఎన్నో అద్భుతాలకు, మరెన్నో ఆచార వ్యవహారాలకు నిలయమైన భారత్‌ (India) లోనే యోగా కూడా పుట్టింది. ఉపనిషత్తులు, భగవద్గీతలో కూడా యోగా ప్రస్తావన ఉంది. ఇండియాలో పుట్టిన యోగా (Yoga) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది.ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి డబ్బు సంపాదించే యంత్రం లాగా తయారయ్యాడు.

తనను తాను మర్చిపోయి తన లక్ష్యాలంటూ పరుగులు తీస్తున్నాడు స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ 24/7 కష్టపడుతున్నారు కానీ తమకంటూ ఓ గంట సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మనిషి శారీరక శ్రమకు దూరమయ్యాడు. మానసికంగా బలహీనమవుతున్నాడు.

గత కొంత కాలం నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆ శ్రద్ద వల్ల రకరకాల ఆరోగ్య డైట్‌లు పుట్టుకొస్తున్నాయి. వీలైనంత వరకు అందరూ ఆరోగ్య సూత్రాలను (Health Tips) పాటిస్తున్నారు. జిమ్‌ల వెంట పరుగులు పెడుతున్నారు. కానీ వీటన్నింటికంటే యోగా అత్యంత మేలైనదని పలు అధ్యయనాలు చెప్పకనే చెబుతున్నాయి.

ఫిట్​నెస్ అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది యోగా. యోగాకు ఇప్పుడు అంతటి ఆదరణ లభిస్తోంది. రోజూ యోగాసనాలు వేయడం ద్వారా రోగాలు దరిచేరవు. యోగాతో ఎలాంటి మానసిక రుగ్మతలు శరీరం నుంచి పారిపోతాయి. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకు ఉందని తెలిసింది. సంపూర్ణ ఆరోగ్యానికి డాక్టరు సూచించే ప్రథమ ఔషధం యోగా. యోగా సాధనతో ఆరోగ్యం, సంపూర్ణ, సమగ్ర వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది.

యోగా వల్ల కలిగే ప్రయోజనాలు:

ఇతర వ్యాయామాలతో లేని గొప్ప ప్రయోజనాలు యోగాతో ఉంటాయి.

యోగాతో శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

శరీరం నుండి విషతుల్యాలు (టాక్సిన్స్) వేగంగా బయటకు వెళ్లిపోతాయి.

ఎవరైనా సులభంగా చేయగలిగే 'ధ్యానం' యోగాలో ప్రధానం.

శ్వాస ప్రక్రియపై ఏకాగ్రత ఉంచి సాధన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది.

Also read: భారత్ లో ఏఐ అసిస్టెంట్‌ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉందంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు