Polavaram : నేడు పోలవరానికి అంతర్జాతీయ జలవనరుల నిపుణులు

AP: ఈరోజు పోలవరానికి అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వెళ్లనున్నారు. నాలుగురోజులపాటు ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు. ఉ.10 గంటలకు ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పరిశీలిస్తారు. దీనిపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు.

New Update
Polavaram : నేడు పోలవరానికి అంతర్జాతీయ జలవనరుల నిపుణులు

International Water Resources Specialists : ఈరోజు పోలవరానికి అంతర్జాతీయ జలవనరుల నిపుణులు వెళ్లనున్నారు. నాలుగురోజులపాటు ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు. ఉ.10 గంటలకు ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పరిశీలిస్తారు. అనంతరం రివర్ బెడ్, జెట్టింగ్‌ పనుల డాక్యుమెంట్లను నిపుణులు పరిశీలించనున్నారు. రెండోరోజు ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాల పరిశీలిస్తారు. మూడోరోజు పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) అథారిటీతో భేటీ అవుతారు.

కేంద్ర జలవనరుల అధికారులతోనూ చర్చిస్తారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ (Contract Agency) తోనూ చర్చలు జరుపుతారు. బృందంలో అమెరికా (America), కెనడా (Canada) కు చెందిన ఇంజనీర్లు ఉన్నారు. అమెరికాకు చెందిన బి.పాల్, డి.సిక్కో.. కెనడాకు చెందిన రిచర్డ్ డొన్నెల్లి, హిచ్‌బర్గర్ ఉన్నారు. వీరికి డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు కట్టడాలకు సంబంధించిన అంశాల్లో 3 దశాబ్దాల అనుభవం ఉంది.

Also Read : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి హౌస్ అరెస్ట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు