టైటానిక్ గల్లంతైన ప్లేస్ యమడేంజర్ .. దర్శకుడు కామెరూన్ షాకింగ్ విషయాలు..! అట్లాంటిక్ మహాసముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్ కథ విషాదాంతమైంది. ఈ క్రమంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేక సార్లు సందర్శించిన హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్.. ఆ ప్రదేశం గురించి గతంలో పంచుకున్న అనుభవాలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. By Shareef Pasha 23 Jun 2023 in సినిమా ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్ కథ విషాదాంతమైంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల టైటాన్ పేలిపోయిందని, దీంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికన్ కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. ఈ క్రమంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేక సార్లు సందర్శించిన హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆ ప్రదేశం గురించి గతంలో పంచుకున్న అనుభవాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. కామెరూన్.. ‘అవతార్’, ‘అవతార్-2’ సహా ఎన్నో భారీ చిత్రాలను తీసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన తీసిన చిత్రాల్లో ‘టైటానిక్’ (Titanic) ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఓడ సముద్రంలో ప్రమాదానికి గురై ఎలా మునిగిపోయిందో కళ్లకు కట్టినట్లు చూపించారు. సముద్రగర్భంలో 13వేల అడుగుల లోతున ఉన్న ‘టైటానిక్’ను కామెరూన్ ఇప్పటికే 33 సార్లు సందర్శించాడు. ఈ సందర్భంగా ఆ అనుభవాలను 2012లో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ‘మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలకు వెళ్లడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే టైటానిక్ షిప్ మునిగిన ప్రాంతానికి వెళ్లా. ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో ఇది ఒకటి’ అని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఓడ ప్రమాదాల్లో టైటానిక్ ఎవరెస్ట్ వంటిది అని కామెరూన్ అన్నారు. ఓడ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలనే ఆకాంక్షతోనే టైటానిక్ సినిమాను తీసినట్లు చెప్పారు. అంతేకానీ, ప్రత్యేకంగా దానిని ఒక సినిమాగా తీయాలనే ఉద్దేశ్యం మొదట్లో తనకు లేదన్నారు. మునిగిపోయిన టైటానిక్ ను చూడాలనే సముద్రగర్భంలో సబ్ మెరైన్ లో ప్రయాణించినట్లు చెప్పారు. దానిని బాగా చూపించాలనే ఉద్దేశ్యంతోనే పలుమార్లు టైటానిక్ మునిగిన ప్రాంతాన్ని సందర్శించినట్లు వెల్లడించారు. మరోవైపు తప్పిపోయి అంతమైన టైటాన్ జలాంతర్గామిపై జేమ్స్ కామెరూన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మాట్లాడిన ఆయన.. ఈ ఘటన తనకు ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదన్నారు. ఇదో భయంకరమైన, విషాదాంతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘కమ్యూనిటీలోని కొందరు ఈ జలాంతర్గామి గురించి చాలా ఆందోళన చెందారు. డీప్ సబ్ మెర్జెన్స్ ఇంజినీరింగ్ కమ్యూనిటీలోని కొంతమంది ముఖ్య సభ్యులు ఓషిగేట్ కంపెనీకి లేఖలు రాశారు. వారు చేస్తున్నది చాలా ప్రయోగాత్మకం’ అని జేమ్స్ కామెరూన్ వెల్లడించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి