ఫ్రాన్స్ నేషనల్ డే వేడుకలకు గెస్ట్‌గా మోదీ, కీలక ఒప్పందాలపై చర్చించనున్న నేతలు భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి పయనమయ్యారు. రేపు ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వాస్తవానికి బాస్టిల్ డే వేడుకలకు విదేశీ నేతలను ఫ్రాన్స్ సాధారణంగా ఆహ్వానించదు. అయితే భారత ప్రధాని మాత్రం ఆ వేడుకలకు హాజరుకావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. By Shareef Pasha 13 Jul 2023 in ఇంటర్నేషనల్ Scrolling New Update షేర్ చేయండి భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి పయనమయ్యారు. రేపు ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వాస్తవానికి బాస్టిల్ డే వేడుకలకు విదేశీ నేతలను ఫ్రాన్స్ సాధారణంగా ఆహ్వానించదు. అయితే భారత ప్రధాని మాత్రం ఆ వేడుకలకు హాజరుకావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అయితే శుక్రవారం జరిగే ఫ్రాన్స్ నేషనల్ డే పరేడ్ లో మోదీ పాల్గొంటారు. యూరప్ లోనే అతి పెద్ద సైనిక కవాతుగా పేరుగాంచిన ఈ పరేడ్ లో మోదీ గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఈ పరేడ్ లో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటుండటం కొసమెరుపు అనే చెప్పాలి. ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు అధికార విందుతో పాటు ప్రైవేటు విందుగా ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇలా భారత ప్రధాని మోదీకి అన్ని రకాల హంగులతో ఆతిథ్యంతో పాటుగా భారత చరిత్రలోనే మోదీ ఒక గొప్ప గౌరవాన్ని సంపాదించుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో మోదీ, మెక్రాన్ పలు అంశాలపై చర్చలను జరపడమే కాకుండా, కీలక ఒప్పందాలను కూడా చేసుకోనున్నారు. ముఖ్యంగా డిఫెన్స్, స్పేస్, సివిల్ న్యూక్లియర్, బ్లూ ఎకానమీ, ట్రేడ్, పెట్టుబడులు, విద్య రంగాలతో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఇరు దేశాల అధినేతలు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వబోతున్నారు. తన పర్యటనలో భాగంగా మోదీ ఆ దేశ ప్రధానమంత్రితో పాటు సెనేట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులతో కూడా సమావేశం కానున్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని కీలక చర్చలు జరపనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలు, ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, ఇండో-పసిఫిక్ ప్రాంత పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. భారత నౌకా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై మోదీ ప్రకటన చేసే అవకాశముంది. విమాన వాహక నౌక INS విక్రాంత్ కోసం ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ మొత్తం డీల్ విలువ 90 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. వీటితోపాటు రక్షణ రంగంలో మరికొన్ని ఒప్పందాలు కూడా రెండు దేశాలూ కుదుర్చుకునే అవకాశముంది. వీటిలోనే సాంకేతిక మార్పిడి కూడా ఉంది. స్కార్పీన్ జలాంతర్గాముల కోసం మళ్లీ ఆర్డరు పెట్టాలని భారత్‌ను ఫ్రాన్స్ కోరుతోంది. నౌకా దళం కోసం ఎన్‌హెచ్90 హెలికాప్టర్లను కూడా కొనుగోలు చేయాలని ఫ్రాన్స్ కోరుతోంది. రక్షణ ఒప్పందాలతోపాటు కొన్ని వ్యూహాత్మక అంశాలు కూడా ఫ్రాన్స్, భారత్ మధ్య చర్చకు వచ్చే అవకాశముంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి