భారీ పైథాన్‌తో యువకుడి యుద్ధం, చివరికి..? పైథాన్‌ను చూస్తేనే మనకు గుండెల్లో గుబులు పుడుతుంది. అంతేకాదు అది మనల్ని ఏం చేస్తుందోనని మనం దానికి చిక్కకుండా పరుగులు తీస్తుంటాం. కానీ ఇక్కడ ఓ యువకుడు మాత్రం భారీ పైథాన్‌తో భారీ యుద్ధమే చేశాడు. దాడి చేసేందుకు యత్నించిన పైథాన్‌ను తన స్నేహితుల సాయంతో మొత్తానికి పట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. By Shareef Pasha 15 Jul 2023 in ఇంటర్నేషనల్ Scrolling New Update షేర్ చేయండి View this post on Instagram A post shared by Glades Boys Python Adventures (@gladesboys) ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. అమెరికా దేశం ఫ్లోరిడాలోని ఓహియో యూనివర్సిటీకి చెందిన ఓ యువకుడు (22) తన స్నేహితులతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వారిని 19 అడుగుల పొడవున్న భారీ పైథాన్ అడ్డగించింది. దాన్ని నుంచి ఎలాగైనా తప్పించుకునేందుకు యత్నించినప్పటికీ వారికి సాధ్యపడలేదు. దీంతో చివరకు ఓ యువకుడు సాహసం చేసి తన మిత్రుల సాయంతో 56.6 కిలోల బరువున్న పైథాన్‌ను ఎలాగొలా పట్టుకుని దాని తలను బిగి సడలకుండా అదిమి పట్టి అలాగే తీసుకెళ్లి అటవీశాఖ అధికారులకు అందజేశారు. రాత్రి సమయాల్లో రోడ్లపైకి..? ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ దక్షిణ ఫ్లోరిడాలో పైథాన్‌లు ఎక్కువగా ఉంటాయని, రాత్రి సమయాల్లో సాధారణంగా రోడ్లపైకి వస్తుంటాయని పేర్కొన్నారు. అయితే 2020 అక్టోబర్‌లో 18 అడుగుల పొడవున్న అత్యంత పెద్దదైనా బర్మీస్ పైథాన్‌ను పట్టుకున్నామని, ఆ తర్వాత ఇదే అత్యంత పెద్ద పైథాన్ అని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ భూమ్మీద ఇప్పటిదాకా అత్యంత పెద్ద పాముగా పేరుగాంచింది. అదేమైనా చేస్తే ఎవ్వరికి నష్టమంటూ నెటిజన్లు ఫైర్ 1,200 కేజీలకు పైగా బరువు, 48 అడుగులకు పైగా పొడవు ఉండే ఈ పాములు. డైనోసార్ల కంటే ముందు కాలంలో ఈ భూమ్మీద జీవించేవని, సుమారు 60 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం వర్షారణ్యాల్లో వీటి ఉనికి ఎక్కువగా ఉండేదని అమెరికాకు చెందిన పరిశోధకులు చెప్తున్నారు. సుమారు 50 అడుగులకు పైగా పొడవు పైథాన్ ఉంటుంది. ఇదిలా ఉంటే... ఒకవేళ అది వారి పనికి ఆటంకం కలిగిస్తే ఎలా వీరు మాత్రమే దాన్ని అడ్డుకుంటారు. అదేమైనా చేస్తే ఎవ్వరికి నష్టం అంటూ ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు కామెంట్లతో ఫైర్ అవుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి